ఆస్ట్రేలియా – ఇండియా మూడో టెస్టు, వర్షం అడ్డంకి

India vs Australia, Sydney Test : ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య మూడో టెస్ట్‌ ప్రారంభమైంది.. సిడ్నీ వేదికగా జరగుతున్న మూడో టెస్టుకు వర్షం ఆటంకిగా మారింది.. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే షాక్‌ ఇచ్చాడు సిరాజ్‌. 7 పరుగుల వద్ద వార్నర్‌ ఔట్‌ అయ్యాడు.. 7 ఓవర్లు ముగిసే సరికి వర్షం పడటంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది..ఆట నిలిచే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 21 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది.

ఈ మ్యాచ్‌లో దాదాపు ఏడాది తర్వాత తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. గత మ్యాచ్‌లో నిరాశపరిచిన మయాంక్‌ అగర్వాల్‌ను పక్కన పెట్టారు. గిల్‌తో కలసి హిట్‌మ్యాన్‌ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. రోహిత్‌ ఎలా ఆడతాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక గాయంతో ఉమేశ్‌యాదవ్‌ దూరం కావడంతో ఆ స్థానంలో యువపేసర్‌ నవదీప్‌ సైనీకి అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌తో సైనీ టెస్టుల్లో ఆరంగ్రేటం చేశాడు. బుమ్రా, సిరాజ్‌లతో కలసి సైనీ పేస్‌ భారాన్ని పంచుకోనున్నాడు… అశ్విన్, జడేజాలు స్పిన్‌ భారాన్ని మోయనున్నారు.

ఇక ఆస్ట్రేలియా జట్టు కూడా కొన్ని మార్పులు చేసింది. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ బర్న్స్ స్థానంలో వార్నర్‌ జట్టులోకి వచ్చాడు. పూర్తిగా పిట్‌నెస్‌ లేకపోయినప్పటికీ వార్నర్‌ను బరిలోకి దించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది. మ్యాచ్ జరుగుతున్న సిడ్నీలో భారత్‌కు గొప్ప రికార్డేమీ లేదు. ఆడిన 12 టెస్టుల్లో ఒకటి మాత్రమే టీమిండియా గెలిచింది. అది కూడా 1978లో బిషన్‌సింగ్‌ బేడీ టైమ్‌లో… ఆ తర్వాత ఇక్కడ 9 టెస్టులు ఆడినా విజయం మాత్రం దక్కలేదు. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోగా ఐదు డ్రా అయ్యాయి. 42 ఏళ్ల నిరీక్షణకు ఈసారైనా తెరదించాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు