India Vs England Test Series 2024 Tickets : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ టికెట్లు జనవరి 18 నుంచి విక్రయం.. ఆరోజు వారికి ఫ్రీ ఎంట్రీ

జనవరి 25 నుంచి 29 వరకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియా - ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.

India Vs England Test Series 2024 : ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో టీమిండియా ఐదు టెస్టు మ్యాచ్ లు ఆడనుంది. ఈనెల 25 నుంచి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ మొదలు కానుంది. ఇందుకోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) ఏర్పాట్లు పూర్తిచేసింది. అయితే, ఈ మ్యాచ్ చూడాలనుకొనేవారికోసం ఈనెల 18 నుంచి టికెట్ల విక్రయాలు చేపట్టనున్నారు. పేటీఎం ఇన్ సైడర్ యాప్ లో ఈ టికెట్లు విక్రయానికి ఉంచారు. మిగిలిన టికెట్లను 22వ తేదీ నుంచి ఆన్ లైన్ తో పాటు జింఖానాలో విక్రయిస్తారు. టికెట్ ధర విషయానికి వస్తే.. ఒక్కో టికెట్ కనీస ధర రూ. 200కాగా. గరిష్టంగా రూ. 4వేలు ఉంది.

Also Read : IND vs AFG 2nd T20 : దంచికొట్టిన శివ‌మ్ దూబె, య‌శ‌స్వి జైస్వాల్‌.. రెండో టీ20 భార‌త్ విజ‌యం.. సిరీస్ కైవ‌సం

మ్యాచ్ సందర్భంగా 25వేల కాంప్లిమెంటరీ పాసులను పాఠశాల విద్యార్థులకు కేటాయించనున్నారు. మ్యాచ్ చూసేందుకు వచ్చే విద్యార్థులకోసం ఉచిత భోజన సదుపాయాన్నికూడా కల్పించనున్నట్లు హచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపాడు. అయితే, తెలంగాణ వ్యాప్తంగా 300లకుపైగా పాఠశాలల నుంచి అర్జీలు వచ్చాయని, వారితో తమ సిబ్బంది ప్రత్యుత్తరాలు నడుపుతున్నారని చెప్పారు. మ్యాచ్ చూసేందుకు అవకాశం లభించిన పాఠశాలల యాజమాన్యాలు.. పాఠశాల విద్యార్థులను తప్పనిసరిగా స్కూల్ యూనిఫామ్స్ తో స్టేడియంకు తీసుకురావాలి.. అంతేకాక, ఐడీ కార్డుతోపాటు స్టేడియంలో ప్రవేశించాక విద్యార్థుల బాధ్యత పాఠశాల యాజమాన్యానిదేనని హెచ్ సీఏ అధ్యక్షుడు తెలిపారు.

Also Read : Rohit Sharma : చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. టీ20ల్లో ఒకే ఒక్క‌డు

ఇండియా – ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ఈనెల 25న ప్రారంభమవుతుంది. ఈనెల 26వ తేదీణ గణతంత్ర దినోత్సవం. ఆరోజు తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న సాయుధ దళాల సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా స్టేడియంలోకి వచ్చి మ్యాచ్ ను చూసేందుకు అమతించనున్నారు. గణతంత్ర దినోత్సవం రోజు ఉచితంగా మ్యాచ్ చూసేందుకు ఆసక్తిఉన్న వారు ఈనెల 18వ తేదీలోగా తమ విభాగాధిపతి సంతకంతో కూడిన లేఖను, కుటుంబ సభ్యుల వివరాలను హెచ్ సీఏ సీఈవోకు మెయిల్ చేయాలని హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు చెప్పారు.

Also Read : KS Bharat : ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు వికెట్ కీప‌ర్‌గా కేఎస్ భరత్.. మరి కేఎల్ రాహుల్?

ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు ఇప్పటికే సెలెక్టర్లు భారత్ జట్టును ప్రకటించారు. ఆంధ్రా క్రికెటర్ కేఎస్ భరత్ కూడా జట్టులో ఉన్నాడు. అయితే, రెండు టెస్టులకు సెలెక్టర్లు ప్రకటించిన జట్టులో ముగ్గురు వికెట్ కీపర్లకు అవకాశం కల్పించారు. వీరిలో కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ కాగా ధ్రువ్ జురెల్ కొత్తగా జట్టులో చేరాడు. అయితే, మొదటి రెండు టెస్టుల్లోనూ కేఎస్ భరత్ వికెట్ కీపర్ గా కొనసాగే అవకాశం ఉందని, కేఎల్ రాహుల్ ను బ్యాటర్ గా జట్టు యాజమాన్యం బరిలోకి దించనుందని తెలుస్తోంది.

ఇండియా – ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ ల షెడ్యూల్ ..

  • జనవరి 25 నుంచి 29 వరకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది.
  • ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు విశాఖపట్టణంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది.
  • ఫిబ్రవరి 15 నుంచి 19వ తేదీ వరకు రాజ్ కోట్ మైదానంలో మూడో టెస్టు జరుగుతుంది.
  • ఫిబ్రవరి 23 నుంచి 27వ తేదీ వరకు రాంచీలో నాల్గో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది.
  • మార్చి 7 నుంచి 11వ తేదీ వరకు ధర్మశాలలో ఐదో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

తొలి రెండు టెస్టులకు భారత్ జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ర్పీత్ బూమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్.

 

 

ట్రెండింగ్ వార్తలు