KS Bharat : ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్.. మరి కేఎల్ రాహుల్?
ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు భారత్ జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. ఈ జట్టులో ముగ్గురు వికెట్ కీపర్లకు అవకాశం కల్పించారు.

KS Bharat
KL Rahul : ఇంగ్లాండ్ తో స్వదేశంలో భారత్ జట్టు ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు ఈనెల 25న హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది. అయితే, రెండు రోజుల క్రితం సెలెక్టర్లు తొలి రెండు టెస్టులకు భారత్ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో ముగ్గురు వికెట్ కీపర్లకు అవకాశం కల్పించారు. కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ తో పాటు ధ్రువ్ జురెల్ కొత్తగా జట్టులో చేరాడు. దీంతో ఈ ముగ్గురిలో ఎవరిని వికెట్ కీపర్ గా తుది జట్టులోకి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, వికెట్ కీపర్ గా ఆంధ్రా ప్లేయర్ కేఎస్ భరత్ వ్యవహరించనున్నాడని తెలుస్తోంది.
ఇండియన్ ఎక్స్ ప్రెస్ నివేదిక ప్రకారం.. కేఎల్ రాహుల్ ను కేవలం బ్యాటింగ్, ఫీల్డింగ్ కోసం ఉపయోగించుకొని వికెట్ కీపర్ గా కేఎస్ భరత్ కు అవకాశం ఇవ్వాలని కోచ్, కెప్టెన్ మొగ్గుచూపుతున్నారట. మరోవైపు మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తుది జట్టులో అవకాశం దక్కడం కష్టంగానే కనిపిస్తోంది. ఒకవేళ అతన్ని జట్టులోకి తీసుకున్నా.. కేవలం బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగంకు తీసుకుంటారని, కేఎస్ భరత్ రెండు టెస్టులకు వికెట్ కీపర్ గా కొనసాగవచ్చునని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read : Rohit Sharma : అఫ్గాన్‌తో రెండో టీ20.. చరిత్ర సృష్టించనున్న రోహిత్.. కోహ్లీ అందుకోవడం కష్టమే..!
మరోవైపు ఐదు టెస్టు మ్యాచ్ లలో ఫాస్ట్ బౌలర్లలో మార్పులు చేర్పులు చేయాలని, తద్వారా బౌలర్లకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ ఇప్పటికే నిర్ణయించింది. ఈ క్రమంలో తొలి రెండు టెస్టు మ్యాచ్ లలో మహ్మద్ సిరాజ్, జస్ర్పీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్ లు ఆడనున్నారు. గాయంతో కోలుకుంటున్న మహ్మద్ షమీ ఇంకా ప్రాక్టీస్ ప్రారంభించలేదు. మూడో టెస్టు నుంచి షమీ అందుబాటులోకి వస్తాడని సమాచారం. షమీ అందుబాటులోకి వస్తే మూడో టెస్టు నుంచి సిరాజ్, బుమ్రాలలో ఎవరికో ఒకరికి విశ్రాంతి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం.
KS Bharat will be India's wicketkeeper in the England Test series.
KL Rahul will play as a specialist batter. (Indian Express). pic.twitter.com/dosaiVc1Vu
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 14, 2024