Shaun Marsh : ప్రొఫెషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన షాన్ మార్ష్ .. ఐపీఎల్‌ ఫస్ట్‌ సూపర్‌ స్టార్‌ అతనే..

ఐపీఎల్ లో షాన్ మార్ష్ కీలక ప్లేయర్ గా కొనసాగాడు. 2008- 2017 వరకు ఐపీఎల్ లో అతను భాగస్వామిగా ఉన్నాడు. మొత్తం 71 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన మార్ష్ తొలి సీజన్ లోనే సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు.

Shaun Marsh : ప్రొఫెషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన షాన్ మార్ష్ .. ఐపీఎల్‌ ఫస్ట్‌ సూపర్‌ స్టార్‌ అతనే..

Shaun Marsh

Updated On : January 14, 2024 / 11:49 AM IST

Australian Batsman Shaun Marsh: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, మిచెల్ మార్ష్ సోదరుడు షాన్ మార్ష్ ప్రొఫెషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) 2023-24లో మెల్ బోర్న్ స్టార్స్ పై మెల్ బోర్న్ రెనెగేడ్స్ విజయంలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 64 పరుగులు చేశాడు. తాజాగా బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ థండర్ తో జరిగిన మెల్ బోర్న్ రెనెగేడ్స్ మ్యాచ్ లో చివరిసారిగా ఆడిన తరువాత రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఆస్ట్రేలియా జట్టు టాప్ ఆర్డర్ లో చాలాకాలం తిరుగులేని బ్యాటర్ గా మార్ష్ కొనసాడాడు. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో మార్ష్ కూడా ఒకడు.

Also Read : Virat Kohli : రీ ఎంట్రీ మ్యాచులో మూడు రికార్డుల పై కోహ్లీ క‌న్ను.. ఎన్ని అందుకుంటాడో మ‌రీ..!

షాన్ మార్ష్ 17ఏళ్ల వయస్సులో 2001లో క్రికెట్ లోకి అరంగ్రేటం చేశాడు. అతని క్రికెట్ కెరీర్ 23 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. ప్రస్తుతం మార్ష్ వయస్సు 40ఏళ్లు. 2019 సంవత్సరంలో టెస్టు క్రికెట్ కు, 2023లో అంతర్జాతీయ వన్డేలకు మార్ష్ స్వస్తి పలికారు. అప్పటి నుంచి దేశవాళీ టోర్నీలకే పరిమితం అయ్యాడు. ఆస్ట్రేలియా జట్టు తరపున మొత్ం 38 టెస్టులు ఆడిన మార్ష్ ఆరు సెంచరీలు చేశాడు. 73 వన్డేలు ఆడగా ఏడు సెంచరీలు చేశాడు. 15టీ20 మ్యాచ్ లలో కేవలం 225 పరుగులు మాత్రమే చేశాడు.

Also Read : Malaysia Open 2024 : చరిత్ర సృష్టించిన సాత్విక్‌-చిరాగ్ జోడి.. మ‌లేషియా ఓపెన్‌లో ఫైన‌ల్‌కు

ఐపీఎల్ లో షాన్ మార్ష్ కీలక ప్లేయర్ గా కొనసాగాడు. 2008- 2017 వరకు ఐపీఎల్ లో అతను భాగస్వామిగా ఉన్నాడు. మొత్తం 71 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన మార్ష్ తొలి సీజన్ లోనే సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు. 2008 సీజన్ లో మార్ష్ ఏకంగా 616 పరుగులు చేశాడు. అందుకే షాన్ మార్ష్ ను ఐపీఎల్ ఫస్ట్ సూపర్ స్టార్ అంటుంటారు. ప్రస్తుతం అతను క్రికెట్ కు పూర్తిస్థాయిలో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా షాన్ మార్ష్ మాట్లాడుతూ.. నేను రెనిగేడ్స్ కు ఆడటాన్ని ఎంతో ఇష్టపడ్డాను. జట్టులోని సహచరులు అందరూ నాకు మంచి స్నేహితులు. వీరితో నా స్నేహం జీవితాంతం గుర్తుంటుంది. నా ఈ ప్రయాణంలో సహాయపడ్డ కోచ్ లు, సిబ్బంది, తెర వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని షాన్ మార్ష్ పేర్కొన్నారు.