IND vs ENG: ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైన భారత్.. 78 పరుగులకే ఆలౌట్!

ఇంగ్లండ్‌తో జరిగే హెడింగ్లే మూడో టెస్టులో టీమిండియా భారత బ్యాట్స్ మెన్ ఘోర వైఫల్యం చెందారు. తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కోహ్లీసేన ఆలౌట్ అయింది.

IND vs ENG: ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైన భారత్.. 78 పరుగులకే ఆలౌట్!

India Vs England 3rd Test Live Score

Updated On : August 25, 2021 / 8:12 PM IST

India vs England 3rd Test : ఇంగ్లండ్‌తో జరిగే హెడింగ్లే మూడో టెస్టులో టీమిండియా భారత బ్యాట్స్ మెన్ ఘోర వైఫల్యం చెందారు. తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కోహ్లీసేన ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన పేలవ ప్రదర్శనతో చేతులేత్తేసింది. ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో భారత్ బ్యాట్స్ మెన్ ఒక్కొక్కరుగా పెవిలియన్ బాటపట్టారు. టీమిండియా మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చెత్త రికార్డును నమోదు చేసింది. భారత జట్టులో రోహిత్ శర్మ ఒక్కడే 19 పరుగులు చేశాడు. ఇదే అత్యధికం కూడా. ఆ తర్వాత రహానె 18 పరుగులు చేశాడు.

మిగిలిన ఆటగాళ్లలో కేఎల్ రాహుల్, షమీ, బుమ్రా డకౌట్ అయ్యారు. ఎవరూ కనీసం పది పరుగులు కూడా చేయలేకపోయారు. ఇంగ్లండ్ ధాటికి 78 పరుగులకే కోహ్లీసేన కుప్పకూలింది. భారత ఆటగాళ్లలో ముగ్గురు కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా డకౌట్ అయ్యారు. ఆరుగురు ప్లేయర్లలో కోహ్లీ (7), పంత్ (2), పుజారా (1), జడేజా (4), ఇషాంత్ శర్మ, (8) సిరాజ్ (3) చెత్త ప్రదర్శనతో చేతులేత్తేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చేశాడు. ఆ తర్వాత శామ్ కరన్, రాబిన్సన్, క్రెయిగ్ ఒవెర్టన్‌లు తర్వాత వికెట్లను పడగొట్టేశారు.


వీరిలో అండర్సన్, ఒవెర్టన్‌ తలో మూడు వికెట్లు తీసుకున్నారు. రాబిన్సన్, శామ్ కరన్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. మొదటి రెండు టెస్టులలో పైచేయి సాధించిన టీమిండియా.. మూడో టెస్టుకు ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఈ మ్యాచ్ టీమిండియా విజయం సాధిస్తే.. సిరీస్ చేజారే అవకాశం సజీవంగా నిలుపుకుంటుంది. రెండు టెస్టులలోనూ విజయం సాధించి అదే జోరుతో మూడో టెస్టులో విజయంపై కన్నేసింది. తొలి ఇన్నింగ్స్ లోనే తడబడిన భారత్.. అత్యంత చెత్త ప్రదర్శనతో వికెట్లను చేజార్చుకుని ఆలౌట్ అయింది.