India vs Netherlands : నెదర్లాండ్ తో భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్.. టీమిండియా ధాటికి డచ్ జట్టు తట్టుకుంటుందా!?
విజయమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతుంది. నెదర్లాండ్ చిన్న జట్టును అంత తేలికగా తీసుకోవటానికి వీల్లేదు.

India vs Netherlands
India vs Netherlands – Cricket World Cup : వన్డే వరల్డ్ కప్ లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న టీమిండియా ఆఖరి లీగ్ మ్యాచ్ కు రెడీ అయింది. ఇవాళ నెదర్లాండ్ ను భారత్ ఢీకొట్టబోతుంది. ఇప్పటివరకు ఒక్క తప్పటడుగు కూడా వేయని రోహిత్ సేన ఈ పోరులో డచ్ జట్టుపై పోరుకు సిద్ధమైంది. మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరు వేదికగా పోరు జరుగనుంది. ఇప్పటికే 8 మ్యాచులు ఆడిన టీమిండియా అన్నింట్లోనూ విజయం సాధించింది.
అందుకే పాయింట్ల పట్టికలో భారత్ అగ్ర భాగాన ఉంది. ఇవాళ నెదర్లాండ్ తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్ లోనూ విజయం సాధించి సత్తా చాటాలని రోహిత్ సేన భావిస్తోంది. విజయమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతుంది. నెదర్లాండ్ చిన్న జట్టును అంత తేలికగా తీసుకోవటానికి
వీల్లేదు.
ICC World Cup : వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ బెర్తులు ఖరారు.. అర్హత సాధించిన ఆ నాలుగు జట్లు
ఈ సిరీస్ లో నెదర్లాండ్ సంచలనాలు సృష్టించి అగ్ర జట్లను ఓడిస్తోంది. దీంతో రోహిత్ సేన కూడా పసికూనను కొట్టి పారేయకుండా బరిలోకి దిగనుంది. మరి టీమిండియా ధాటికి నెదర్లాండ్ ఎలా తట్టుకుంటుంది అన్నది ఆసక్తి రేపుతోంది.