భారత పేలవ ఫీల్డింగ్‌: కరేబియన్ల తొలి విజయం

కోహ్లీ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు చేరాడు. బౌండరీకి దూసుకెళ్తున్న బంతిని పరిగెత్తుకుంటూ వెళ్లి అందుకున్నాడు కోహ్లీ. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పూరన్‌తో కలిసి సిమన్స్‌ లాంఛనాన్ని పూర్తి చేశాడు. సుందర్‌, జడేజా చెరో వికెట్‌ తీయగలిగారు. 

భారత పేలవ ఫీల్డింగ్‌: కరేబియన్ల తొలి విజయం

Updated On : December 9, 2019 / 1:37 AM IST

కోహ్లీ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు చేరాడు. బౌండరీకి దూసుకెళ్తున్న బంతిని పరిగెత్తుకుంటూ వెళ్లి అందుకున్నాడు కోహ్లీ. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పూరన్‌తో కలిసి సిమన్స్‌ లాంఛనాన్ని పూర్తి చేశాడు. సుందర్‌, జడేజా చెరో వికెట్‌ తీయగలిగారు. 

భారత పర్యటనలో భాగంగా ఆడుతున్న టీ20 సిరీస్ లో కరేబియన్లు తొలి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ లో కొద్దిపాటిలో విజయం చేజారినా రెండో టీ20 కలిసొచ్చింది. భారత పేలవ ఫీల్డింగ్ ను అవకాశంగా మలచుకొని చెలరేగిపోయారు. వెస్టిండీస్ ఓపెనర్లు లూయిస్‌, సిమన్స్‌ సమన్వయంతో ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. 

సుందర్‌ బౌలింగ్‌లో లూయిస్‌ ఔటవ్వడంతో 73 పరుగుల వీరి భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. వన్‌డౌన్‌లో వచ్చిన హెట్‌మేయర్‌ కూడా బ్యాట్ ఝుళిపించడంతో విండీస్ రన్‌రేట్‌ మెరుగ్గా సాగింది. జడేజా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన హెట్‌మేయిర్‌ (23) కోహ్లీ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు చేరాడు. బౌండరీకి దూసుకెళ్తున్న బంతిని పరిగెత్తుకుంటూ వెళ్లి అందుకున్నాడు కోహ్లీ. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పూరన్‌తో కలిసి సిమన్స్‌ లాంఛనాన్ని పూర్తి చేశాడు. సుందర్‌, జడేజా చెరో వికెట్‌ తీయగలిగారు. 

దూబే-పంత్‌లు మాత్రమే:
భారత్‌కు ఆదిలోనే ఆటంకం ఎదరైంది. పియర్‌ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (11) పరుగులకే ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో కోహ్లీ బ్యాటింగ్‌కు రాకుండా శివమ్‌ దూబేని పంపించాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని దూబే నిలబెట్టుకున్నాడు. ఇతర బ్యాట్స్‌మెన్‌ అంతా స్వేచ్ఛగా ఆడలేకపోతున్నప్పటికీ బ్యాట్‌ ఝుళిపిస్తూ పరుగులు కురిపించాడు. కొద్దిసేపటికే రోహిత్‌ (15) పెవిలియన్‌కు చేరాడు. ఓపెనర్లు తొందరగానే ఔటైనా కోహ్లీ (19)తో కలిసి దూబే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 

బౌండరీలతో విండీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. హేడెన్‌ వాల్ష్‌ బౌలింగ్‌లో దూకుడుగా ఆడే క్రమంలో హెట్‌మెయిర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాసేపటికే కోహ్లీ కూడా వెనుదిరగాడు. తర్వాత పంత్ (33*) మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. క్రీజులోకి వచ్చిన పంత్‌ తొలుత దూకుడుగా ఆడిన వికెట్లు పడుతుండటంతో తర్వాత నెమ్మదించాడు. శ్రేయాస్‌ (10), జడేజా (9), సుందర్‌ (డకౌట్)లతో నిరాశపర్చారు. వెస్టిండీస్‌ బౌలర్లలో విలియమ్స్‌, వాల్ష్‌ చెరో 2 వికెట్లతో భారత్ ను కట్టడి చేశారు. 

ఫీల్డింగే కొంపముంచింది:
మొదటి టీ20 మాదిరిగానే మరోసారి ఫీల్డింగ్‌లో నిరాశపరిచింది టీమిండియా. సుందర్‌, పంత్‌, శ్రేయాస్ క్యాచ్‌లను జారవిడిచారు. భువీ వేసిన ఐదో ఓవర్లోనే వెస్టిండీస్‌ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపించే అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. సిమన్స్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను సుందర్‌, లూయిస్‌ ఇచ్చిన క్యాచ్‌ను పంత్‌ జారవిడిచాడు. కీలక సమయంలో శ్రేయాస్‌ కూడా క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. చాహర్‌ వేసిన 17వ ఓవర్లో పూరన్‌ ఇచ్చిన క్యాచ్‌ను శ్రేయాస్‌ మిస్‌ చేశాడు.