India won first test against Australia
IND vs AUS 1st Test : బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. ఆసీస్ పై 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. 534 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు నాల్గో రోజు ఆటలో 238 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇండియా 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Also Read: AUS vs IND : ధ్రువ్ జురెల్ సూపర్ క్యాచ్.. కంగుతిన్న మిచెల్ స్టార్క్.. వీడియో వైరల్
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. మూడో రోజు ఆటలో టీమిండియా 487 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో ఆస్ట్రేలియా ఎదుట 534 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనకోసం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. నాలుగో రోజు (సోమవారం) ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఆస్ట్రేలియా వరుస వికెట్లు కోల్పోతూ వచ్చింది. ట్రావిస్ హెడ్ (89), మిచెల్ మార్ష్ (47), అలెక్స్ కారీ (36) మినహా ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎవరూ పెద్దగా పరుగులు చేయకుండానే పెవిలియన్ బాట పట్టారు.
రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు జస్ర్పీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీశారు. హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇదిలాఉంటే.. మొదటి ఇన్నింగ్స్ లో బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. దీంతో తొలి టెస్టులో కెప్టెన్ గా ఉన్న బుమ్రా రెండు ఇన్నింగ్స్ లో కలిపి ఎనిమిది వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించాడు.
తొలి టెస్టులో..
భారత జట్టు తొలి ఇన్నింగ్స్ : 150
ఆస్ట్రేలియా తొలి ఇన్నిగ్స్ : 104
భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ : 487 డిక్లేర్డ్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 238
భారత్ జట్టు 295 పరుగుల తేడాతో విజయం సాధించింది.
🚨 INDIA BEAT AUSTRALIA BY 295 RUNS IN PERTH TEST…!!!! 🚨 pic.twitter.com/CITESW38ni
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 25, 2024