Sania Mirza Farewell Match : హైదరాబాద్ లో సానియా మీర్జా ఫేర్ వెల్ మ్యాచ్.. 20 ఏళ్ల క్రితం ప్రాక్టీస్ మొదలు పెట్టిన చోటే ఫైనల్ మ్యాచ్
టెన్నిస్ కు వీడ్కోలు పలికిన భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా అభిమానుల కోసం ఆదివారం (మార్చి5,2023) ఫేర్ వెల్ మ్యాచ్ ఆడనుంది. హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియంలో సానియా-రోహన్ బొప్పన్న టీమ్స్ తలపడనున్నాయి.

Sania Mirza
Sania Mirza Farewell Match : టెన్నిస్ కు వీడ్కోలు పలికిన భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా అభిమానుల కోసం ఆదివారం (మార్చి5,2023) ఫేర్ వెల్ మ్యాచ్ ఆడనుంది. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియంలో సానియా-రోహన్ బొప్పన్న టీమ్స్ తలపడనున్నాయి. డబుల్స్ లో సానియా మీర్జా- బొప్పన్న జోడీ, ఇవాన్ డోర్నిక్- మ్యాటిక్ సాన్స్ జంటను ఢీకొట్టనుంది. మొత్తం రెండు మ్యాచ్ లు నిర్వహించనున్నారు.
సానియా చివరి సారి ఆడనున్న ఈ రెండు మ్యాచ్ లు చూసేందుకు పలువురు, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు తరలిరానున్నారు. 20 ఏళ్ల కిందట తాను ఎక్కడ ప్రాక్టీస్ చేశానో అక్కడే ఆఖరి మ్యాచ్ ఆడబోతున్నానని సానియా మీర్జా అన్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు తన కుటుంబం, స్నేహితులు వస్తున్నారని తెలిపారు. కెరియర్ లో చివరి మ్యాచ్ కోసం ఎంతో ఆస్తక్తిగా ఎదురు చూస్తున్నానని సానియా అన్నారు.
Sania Mirza: టెన్నిస్‌కు సానియా మీర్జా గుడ్‌బై.. రిటైర్మెంట్ ప్రకటించిన సానియా
20 ఏళ్ల కెరియర్ ఎంతో సంతృప్తి ఇచ్చిందని పేర్కొన్నారు. మహిళల టెన్నిస్ లో చెరగని ముద్ర వేసిన సానియా మీర్జా దుబాయ్ చాంపియన్ షిప్ లో ఓటమితో కెరీర్ ముగించింది. డబుల్స్ లో వరల్డ్ నెంబర్ సాధించిన సానియా ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను గెలిచారు. డబుల్స్, మిక్స్ డబుల్స్ లోనూ మూడేసి టైటిల్స్ సాధించారు.
ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ లో మిక్స్ డబుల్స్ లో సానియా, బొపన్న జోడీ రన్నరప్ తో సరిపెట్టుకుంది. టెన్నిస్ లో ఎన్నో విజయాలు సాధించిన సానియా మహిళా ప్రీమియర్ లీగ్ లో మెంటర్ గా కొత్త పాత్రలో కనిపించనుంది. రాయల్ చాలెంజర్స్-బెంగళూరు జట్టు మెంటర్ గా ఆమె సేవలు అందించనుంది.