Praggnanandhaa: ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్‌లో వరల్డ్ నెం.1ను ఓడించిన ఇండియన్ ప్లేయర్ ప్రగ్నానందా
16 సంవత్సరాల వయస్సున్న ఇండియన్ గ్రాండ్ మాస్టర్ రమేశ్ బాబు ప్రగ్నానంద గుర్తుండిపోయే ఫీట్ చేశాడు. 31 సంవత్సరాల కార్ల్‌సన్ ను మూడు వరుస విజయాల తర్వాత ఓడించి షాక్ ఇచ్చాడు ప్రగ్నానందా.

Pragna Chess
Praggnanandhaa: 16 సంవత్సరాల వయస్సున్న ఇండియన్ గ్రాండ్ మాస్టర్ రమేశ్ బాబు ప్రగ్నానంద గుర్తుండిపోయే ఫీట్ చేశాడు. ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన గేమ్‌లో ఎనిమిదో రౌండ్‌లో వరల్డ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను కేవలం 39 మూవ్స్ తో ఓడించాడు.
31 సంవత్సరాల కార్ల్‌సన్ ను మూడు వరుస విజయాల తర్వాత ఓడించి షాక్ ఇచ్చాడు ప్రగ్నానందా. ఫలితంగా 11వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకాడు.
ప్రగ్నానందా ఎనిమిది రౌండ్లు ముగించుకుని ఎనిమిది పాయింట్లతో 12వ స్థానానికి చేరాడు. గత రౌండ్లతో పోలిస్తే.. లెవో అరోనియన్ పై సాలిడ్ విక్టరీ సాధించాడు. ఈ రౌండ్లలో రెండు డ్రాలు, నాలుగు ఓటములను కూడా చవిచూశాడు. ఏదేమైనా ప్రగ్నానందాకు గేమ్‌లు పక్కకుపెడితే కార్ల్‌సన్‌ను ఓడించడం ఇదే తొలిసారి.
Read Also: వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భరతకోటి హ్యాట్రిక్ విక్టరీ
Airthings Masters అనే ఈ గేమ్ లో 16మంది ప్లేయర్లు ఆడతారు. ఒక మ్యాచ్ గెలిస్తే 3పాయింట్లు డ్రా చేయగలిగితే ఒక్క పాయింట్ వస్తాయి.
విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్‌కు బదులిచ్చిన ప్రగ్నానందా.. ఇక పడుకుందామనుకుంటున్నా అంటూ ముగించాడు. 2018లో టైటిల్ ఆఫ్ గ్రాండ్ మాస్టర్ సాధించిన ప్రగ్నానందా.. ఆ టైటిల్ దక్కించుకున్న ఐదో యువ ప్లేయర్ గా నిలిచాడు.