Jasprit Bumrah Stunning Catch : వావ్.. ఎక్స్‌లెంట్.. స్టన్నింగ్‌ క్యాచ్ పట్టిన బుమ్రా.. వీడియో వైరల్

తాత్కాలిక కెప్టెన్‌ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్నాడు. తొలుత సంచలన బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత బంతితో నిప్పులు చెరిగాడు. అంతేకాదు..ఫీల్డింగ్ లోనూ వావ్ అనిపించాడు. స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు.

Jasprit Bumrah Stunning Catch : భారత్, ఇంగ్లండ్ మధ్య బర్మింగ్ హామ్ లో జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. భారత బౌలర్లు రాణించారు. ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ లో 284 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టీమిండియాకు 100 పరుగులకు పైగా లీడ్ లభించింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఇక ఈ మ్యాచ్ లో తాత్కాలిక కెప్టెన్‌ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్నాడు. తొలుత సంచలన బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత బంతితో నిప్పులు చెరిగాడు. అంతేకాదు..ఫీల్డింగ్ లోనూ మెరిశాడు. స్టన్నింగ్ క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

Jasprit Bumrah: బ్రియాన్ లారా వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన బుమ్రా

ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్‌ (36 బంతుల్లో 25 పరుగులు 4 ఫోర్లు) ఆడిన షాట్‌ను బుమ్రా క్యాచ్‌ అందుకున్నాడు. శార్దూల్ వేసిన 38వ ఓవర్‌ నాలుగో బంతికి స్టోక్స్‌ బౌండరీ కొట్టే ప్రయత్నం చేయగా.. దూరంగా వెళ్తున్న బంతిని బుమ్రా అమాంతం గాల్లోకి డైవ్‌ చేస్తూ రెండు చేతులతో ఒడిసిపట్టాడు. దీంతో ఇంగ్లడ్‌ కెప్టెన్‌ పెవిలియన్‌ చేరగా.. బెయిర్‌ స్టోతో కలిసి అతడు నిర్మించిన 66 పరుగుల ఆరో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.

Rishabh Pant: ఇండియా బెస్ట్ వికెట్ కీపర్ – బ్యాటర్ రిషబ్ పంతేనట

ఈ వీడియోను ఇంగ్లండ్‌ క్రికెట్‌ టీమ్‌ ట్విటర్‌లో షేర్ చేసి బుమ్రాను మెచ్చుకుంది. వావ్.. ఎక్స్ లెంట్.. వాటే స్టన్నింగ్ క్యాచ్ అంటూ బుమ్రాపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. బుమ్రా ఆ క్యాచ్ పట్టగానే అంతా ఆశ్చర్యపోయారు. బెన్ స్టోక్స్ కూడా కాసేపు అలా ఆశ్చర్యంగా చూస్తూ నిల్చుండిపోయాడు. చివరికి బుమ్రా కూడా నమ్మలేకపోయాడు. బుమ్రా ఎడమ వైపుకి డైవ్ చేసి ఆ క్యాచ్ ను అందుకున్నాడు. బుమ్రా ఆ క్యాచ్ పడతాడని ఎవరూ ఊహించలేదు. చివరికి బుమ్రా కూడా.

ఇక ఈ మ్యాచ్ లో బుమ్రా బ్యాట్ తో సంచలనం నమోదు చేశాడు. టెస్ట్ క్రికెట్ లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. టెస్టుల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు (35) సాధించిన క్రికెటర్ గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన 84వ ఓవర్‌లో బుమ్రా (4, 5 వైడ్స్‌, 6 నోబాల్‌, 4, 4, 4, 6, 1) దంచికొట్టాడు. దీంతో ఒకే ఓవర్‌లో మొత్తం 35 పరుగులు రాబట్టాడు. కాగా.. లారా (2003), బెయిలీ (2013), కేశవ్‌ మహారాజ్‌ (2020) ఒకే ఓవర్‌లో 28 పరుగుల చొప్పున బాదారు. ఇప్పుడు బుమ్రా ఈ ముగ్గురినీ అధిగమించి కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే విండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ బ్రియాన్ లారా ప్రత్యేకంగా ట్వీట్‌ చేసి బుమ్రాను మెచ్చుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు