IPL 2021 RR Vs RCB : మ్యాక్స్‌వెల్ మెరుపులు.. రాజస్తాన్ పై బెంగళూరు ఘన విజయం

ఐపీఎల్ 2021 మలి దశలో భాగంగా రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ పై ఘన విజయం సాధించింది. రాజస్తాన్ విధించిన

IPL 2021 RR Vs RCB : మ్యాక్స్‌వెల్ మెరుపులు.. రాజస్తాన్ పై బెంగళూరు ఘన విజయం

Bangalore Won By 7 Wickets On Rajasthan

Updated On : September 29, 2021 / 11:34 PM IST

ఐపీఎల్ 2021 మలి దశలో భాగంగా రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ పై ఘన విజయం సాధించింది. రాజస్తాన్ విధించిన 150 పరుగుల టార్గెట్ ను బెంగళూరు ఛేదించింది. మరో 17 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది.

Diwali With Mi Sale : స్మార్ట్ ఫోన్లు, టీవీలపై రూ.75వేల వరకు డిస్కౌంట్.. షావోమీ అదిరిపోయే ఆఫర్లు

బెంగళూరు జట్టులో మ్యాక్స్ వెల్ మరోసారి మెరిశాడు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది బెంగళూరు జట్టుని గెలిపించాడు. శ్రీకర్ భరత్ 35 బంతుల్లో 44 పరుగులతో రాణించాడు. కెప్టెన్ కోహ్లి 25 పరుగులు, పడిక్కల్ 22 పరుగులు చేశారు. రాజస్తాన్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ మాత్రమే రెండు వికెట్లు తీశాడు.

Gold : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.100 కే గోల్డ్..!

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. రాజస్తాన్‌ ఓపెనర్లు ఎవిన్‌ లూయిస్‌ (58.. 37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), యశస్వీ జైస్వాల్‌ (31.. 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) శుభారంభం చేశారు. దూకుడుగా ఆడుతూ తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించారు. ఈ క్రమంలో డేనియల్‌ క్రిస్టియన్‌ వేసిన 8.2 బంతికి జైస్వాల్‌.. సిరాజ్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ అయ్యాడు. తర్వాత, జార్జ్‌ గార్టన్‌ వేసిన 12వ ఓవర్‌లో ఎవిన్‌ లూయిస్‌.. కీపర్‌కి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన సంజూ శాంసన్‌ (19) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. షాబాజ్‌ అహ్మద్‌ వేసిన 13వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి దేవ్‌దత్ పడిక్కల్‌కి చిక్కాడు.

అదే ఓవర్ చివరి బంతికి మహిపాల్ లోమ్రోర్ (3) కూడా వెనుదిరిగాడు. దీంతో ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన రాజస్తాన్‌ జట్టు.. ఆ తర్వాత పుంజుకోలేకపోయింది. రాహుల్‌ తెవాటియా (2), లివింగ్‌ స్టోన్‌ (6), రియాన్‌ పరాగ్‌ (9), మోరిస్‌ (14) వెంట వెంటనే ఔటయ్యారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ మూడు, యుజువేంద్ర చాహల్‌, షాబాజ్‌ అహ్మద్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్జ్‌ గార్టన్‌, డేనియల్ క్రిస్టియన్‌ చెరో వికెట్‌ తీశారు. చివరి ఓవర్లో బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. రియాన్ పరాగ్‌, క్రిస్ మోరిస్‌ని వరుస బంతుల్లో పెవిలియన్‌కి పంపించాడు. చివరి బంతికి మరో వికెట్‌ తీశాడు. దీంతో ఒకే ఓవర్ లో రాజస్తాన్ 3 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ లో గెలుపుతో బెంగళూరు ప్లే ఆఫ్ దిశగా మరింత ముందుకెళ్లింది.