IPL Mega Auction 2022: ఆర్‌సీబీ ఈ ముగ్గురి కోసం వేలంలో పోటీ పడవచ్చు

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మెగా వేలంలో, వెస్టిండీస్ ఆల్-రౌండర్ జాసన్ హోల్డర్ అత్యంత ఖరీదైన ఆటగాళ్ళలో ఒకరుగా ఉండవచ్చు.

IPL Mega Auction 2022: ఆర్‌సీబీ ఈ ముగ్గురి కోసం వేలంలో పోటీ పడవచ్చు

Rcb

Updated On : February 8, 2022 / 12:50 PM IST

IPL Mega Auction 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మెగా వేలంలో, వెస్టిండీస్ ఆల్-రౌండర్ జాసన్ హోల్డర్ అత్యంత ఖరీదైన ఆటగాళ్ళలో ఒకరుగా ఉండవచ్చు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) అతనిని తమ జట్టులో చేర్చుకోవడానికి భారీ మొత్తాన్ని రిజర్వ్‌ చేసుకుంది. హోల్డర్‌తో పాటు అంబటి రాయుడు, రియాన్ పరాగ్‌లను కూడా కొనుగోలు చేయడానికి ఆర్‌సీబీ సిద్ధమైంది.

జాసన్ హోల్డర్ తన జట్టు వెస్టిండీస్‌కే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అన్నీ ఫ్రాంచైజీ జట్లలో బాగా రాణిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో, ఈ డాషింగ్ ఆల్-రౌండర్ బ్యాటింగ్‌లోనూ.. బౌలింగ్‌లోనూ రెండింటిలోనూ అద్భుత ప్రదర్శన చేశాడు.

హోల్డర్ వల్లే విండీస్ సిరీస్‌లో 3-2తో ఇంగ్లాండ్‌ను ఓడించగలిగింది. అటువంటి పరిస్థితిలో, IPL ఫ్రాంచైజీ జట్లు హోల్డర్ కోసం ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసే అవకాశం ఉంది. గాయం కారణంగా మిచెల్ మార్ష్ ఐపీఎల్ అంతటా అందుబాటులో ఉండగలడా? అనేది అనుమానమే.

సమాచారం ప్రకారం, ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోల్డర్ కోసం రూ. 12 కోట్లు రిజర్వ్ చేసింది. ఇవి కాకుండా అంబటి రాయుడుకి 8 కోట్ల రూపాయలు, రియాన్ పరాగ్‌కి 7 కోట్ల రూపాయలు ఉంచినట్లుగా తెలుస్తోంది. ఈ ఆటగాళ్లకు 27 కోట్లు ఖర్చు చేస్తే, వారికి మరో 28 కోట్లు మిగులుతాయి. కోహ్లి, మ్యాక్స్‌వెల్, సిరాజ్‌లతో పాటు హోల్డర్, రాయుడు, పరాగ్‌లను రాయల్ ఛాలెంజర్స్ జట్టు కలుపుకోవాలని ఫ్రాంచైజీ భావిస్తోంది