IPL 2022 Final : ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కీలక మార్పులు

సాధారణంగా ఐపీఎల్ లో లీగ్ మ్యాచ్ లను రాత్రి 7 గంటలకు టాస్ వేసి 7.30 గంటలకు స్టార్ట్ చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఫైనల్ ను కూడా ఇలాగే నిర్వహించాలి. కానీ,

Ipl 2022 Final

IPL 2022 Final : ఈ నెల 29న నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరగనునన్న ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ లో బీసీసీఐ పలు మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మ్యాచ్ కు ముందు ముగింపు వేడుకలను నిర్వహించనున్న బీసీసీఐ.. వాటిని దృష్టిలో పెట్టుకుని మ్యాచ్ టైమింగ్ లో మార్పులు చేసింది. రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమవ్వాల్సిన మ్యాచ్‌ను 8 గంటలకు ఆరంభించనున్నట్లు సమాచారం.

Ipl

సాధారణంగా ఐపీఎల్ లో లీగ్ మ్యాచ్ లను రాత్రి 7 గంటలకు టాస్ వేసి 7.30 గంటలకు స్టార్ట్ చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఫైనల్ ను కూడా ఇలాగే నిర్వహించాలి. కానీ ముగింపు వేడుకల వల్ల మ్యాచ్ ను అరగంట ఆలస్యంగా స్టార్ట్ చేయనున్నారు. అంటే, రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Virat Kohli: రషీద్ ఖాన్‌కు బ్యాట్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ

మే 29న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైన్ మ్యాచ్ జరగనుంది. తుదిపోరుకు ముందు బాలీవుడ్ తారలతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తో ప్రదర్శనలు నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. సాయంత్రం 6.30 గంటలకు ఇవి ప్రారంభం అవుతాయి.

Modi Stadium (1)

సాయంత్రం 6.30 గంటల నుంచి 7.20 వరకు ముగింపు వేడుకలు జరుగుతున్నాయి. 50 నిమిషాల సంగీత, నాట్య ప్రదర్శనలు ముగిసిన తర్వాత పది నిమిషాల గ్యాప్ ఇచ్చి రాత్రి 7.30 కు టాస్ వేస్తారు. ఆ తర్వాత అరగంట గ్యాప్ ఉంటుంది. అంటే రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

IPL 2022: కేన్ మామ ఇక ఇంటికే.. ఇట్స్ ఏ గుడ్ న్యూస్ బ్రో!

ఐపీఎల్‌-2022 ముంగిపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే రెండు ప్లే ఆఫ్‌ బెర్తులు ఖరారు కాగా.. మూడు, నాలుగు స్థానాల కోసం ఆసక్తికర పోటీ నెలకొంది. మే 24 నుంచి ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. కోల్‌కతాలో ఫస్ట్‌ క్వాలిఫైయర్‌, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు జరుగనుండగా.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్‌ జరగనుంది. ఇప్పటికే కొత్త ఫ్రాంఛైజీలు గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి.