IPL 2023, MI Vs PBKS: ముంబై పై గెలిచిన పంజాబ్
IPL 2023, MI Vs PBKS:వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 201 పరుగులకే పరిమితమైంది.

MI Vs PBKS
IPL 2023, MI Vs PBKS: వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 201 పరుగులకే పరిమితమైంది. దీంతో పంజాబ్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
LIVE NEWS & UPDATES
-
పంజాబ్ విజయం
వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 201 పరుగులకే పరిమితమైంది. దీంతో పంజాబ్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై బ్యాటర్లలో కామెరూన్ గ్రీన్ (67; 43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్(57; 26 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకాలతో దుమ్మురేపగా రోహిత్ శర్మ(44; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో టిమ్ డేవిడ్(25 నాటౌట్; 13 బంతుల్లో 2సిక్సర్లు) లు జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు.
-
సూర్యకుమార్ యాదవ్ ఔట్
ముంబై మరో వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో అథర్వ తైడే క్యాచ్ అందుకోవడంతో సూర్యకుమార్(57) ఔటైయ్యాడు. దీంతో 182 పరుగుల వద్ద(17.4వ ఓవర్) ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. 18 ఓవర్లకు ముంబై స్కోరు 184/4. తిలక్ వర్మ(1), టిమ్ డేవిడ్( 11)క్రీజులో ఉన్నారు.
-
సూర్యకుమార్ హాఫ్ సెంచరీ
సామ్ కరన్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 23 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు సూర్యకుమార్. ఈ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లకు ముంబై స్కోరు 175/3. సూర్యకుమార్ యాదవ్ (57), టిమ్ డేవిడ్(3) క్రీజులో ఉన్నారు.
-
గ్రీన్ ఔట్
అర్ధశతకం తరువాత గ్రీన్ దూకుడు పెంచాడు. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టాడు. అదే ఊపులో మరో భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్ వద్ద సామ్ కరన్ చేతికి చిక్కాడు. దీంతో ముంబై 159 పరుగుల వద్ద(15.3వ ఓవర్) మూడో వికెట్ కోల్పోయింది.
-
సిక్సర్‌తో కామెరూన్ గ్రీన్ అర్ధశతకం
రాహుల్ చాహర్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్ సిక్స్ కొట్టి 38 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లకు ముంబై స్కోరు 149/2. సూర్యకుమార్ యాదవ్ (44), కామెరూన్ గ్రీన్(57) క్రీజులో ఉన్నారు.
-
సూర్యకుమార్ యాదవ్ సిక్స్, ఫోర్
సామ్ కరన్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఓ సిక్స్, ఓ ఫోర్ కొట్టడంతో ఈ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లకు ముంబై స్కోరు 132/2. సూర్యకుమార్ యాదవ్ (39), కామెరూన్ గ్రీన్(45) క్రీజులో ఉన్నారు.
-
సూర్యకుమార్ యాదవ్ సిక్స్
నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో సూర్యకుమార్ సిక్స్ బాదడంతో ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లకు ముంబై స్కోరు 118/2. సూర్యకుమార్ యాదవ్ (27), కామెరూన్ గ్రీన్(43) క్రీజులో ఉన్నారు.
-
సూర్యకుమార్ యాదవ్ హ్యాట్రిక్ ఫోర్లు
లియామ్ లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టడంతో ఈ ఓవర్‌లో మొత్తం 14 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లకు ముంబై స్కోరు 109/2. సూర్యకుమార్ యాదవ్ (19), కామెరూన్ గ్రీన్(42) క్రీజులో ఉన్నారు.
-
సూర్యకుమార్ యాదవ్ ఫోర్
రాహుల్ చాహర్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఓ ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లకు ముంబై స్కోరు 95/2. సూర్యకుమార్ యాదవ్ (6), కామెరూన్ గ్రీన్(41) క్రీజులో ఉన్నారు.
-
రోహిత్ ఔట్
ముంబై మరో వికెట్ కోల్పోయింది. లియామ్ లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ(44) ఔటైయ్యాడు. దీంతో 84 పరుగుల వద్ద(9.3వ ఓవర్) ముంబై రెండో వికెట్ కోల్పోయింది. 10 ఓవర్లకు ముంబై స్కోరు 88/2. సూర్యకుమార్ యాదవ్ (1), కామెరూన్ గ్రీన్(39) క్రీజులో ఉన్నారు.
-
రోహిత్ సిక్స్, ఫోర్
తొమ్మిదో ఓవర్‌ను రాహుల్ చాహర్ వేశాడు. ఈ ఓవర్‌లోని మూడో బంతికి రోహిత్ సిక్స్, ఆఖరి బంతికి ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్‌లో మొత్తం 13 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లకు ముంబై స్కోరు 79/1. రోహిత్ శర్మ(40), కామెరూన్ గ్రీన్(35) క్రీజులో ఉన్నారు.
-
గ్రీన్ ఫోర్
ఎనిమిదో ఓవర్‌ను హర్ ప్రీత్ బ్రార్ వేశాడు. ఈ ఓవర్‌లోని ఐదో బంతికి గ్రీన్ ఫోర్ కొట్టడంతో 7 పరుగులు వచ్చాయి. 8 ఓవర్లకు ముంబై స్కోరు 66/1 రోహిత్ శర్మ(29), కామెరూన్ గ్రీన్(33) క్రీజులో ఉన్నారు.
-
5 పరుగులు
ఏడో ఓవర్‌ను రాహుల్ చాహర్ వేశాడు. ఈ ఓవర్‌లో ఐదు పరుగులు వచ్చాయి. 7 ఓవర్లకు ముంబై స్కోరు 59/1 రోహిత్ శర్మ(28), కామెరూన్ గ్రీన్(27) క్రీజులో ఉన్నారు.
-
పవర్ ప్లే
ముంబై ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే ముగిసింది. ఆరో ఓవర్‌ను నాథన్ ఎల్లిస్ వేశాడు. ఈ ఓవర్‌లోని రెండో బంతికి గ్రీన్ ఫోర్ కొట్టడంతో మొత్తంగా 8 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు ముంబై స్కోరు 54/1 రోహిత్ శర్మ(26), కామెరూన్ గ్రీన్(24) క్రీజులో ఉన్నారు.
-
13 పరుగులు
ఐదో ఓవర్‌ను సామ్ కరన్ వేశాడు. ఈ ఓవర్‌లోని నాలుగో బంతికి రోహిత్ శర్మ సిక్స్ కొట్టగా, ఆఖరి బంతికి కామెరూన్ గ్రీన్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు ముంబై స్కోరు 46/1 రోహిత్ శర్మ(24), కామెరూన్ గ్రీన్(18) క్రీజులో ఉన్నారు.
-
రోహిత్ సిక్స్, గ్రీన్ ఫోర్
నాలుగో ఓవర్‌ను అర్ష్‌దీప్ సింగ్. ఈ ఓవర్‌లోని నాలుగో బంతికి కామెరూన్ గ్రీన్ ఫోర్ కొట్టగా ఆఖరి బంతికి రోహిత్ శర్మ సిక్స్ బాదాడు. ఈ ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు ముంబై స్కోరు 33/1 రోహిత్ శర్మ(17), కామెరూన్ గ్రీన్(13) క్రీజులో ఉన్నారు.
-
కామెరూన్ గ్రీన్ సిక్స్
మూడో ఓవర్‌ను హర్‌ప్రీత్ బ్రార్ వేశాడు. ఈ ఓవర్‌లోని మూడో బంతికి కామెరూన్ గ్రీన్ సిక్స్ కొట్టడంతో ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. 3 ఓవర్లకు ముంబై స్కోరు 21/1 రోహిత్ శర్మ(10), కామెరూన్ గ్రీన్(8) క్రీజులో ఉన్నారు.
-
ఇషాన్ కిషన్ ఔట్
ముంబై జట్టుకు షాక్ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ రెండో ఓవర్‌ను వేశాడు. తొలి బంతికే ఇషాన్ కిషన్‌ను ఔట్ చేశాడు. షాట్ ఆడేందుకు యత్నించిన ఇషాన్ కిషన్(1) మాథ్యూ షాట్ చేతికి చిక్కాడు. దీంతో 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 2 ఓవర్లకు ముంబై స్కోరు 13/1 రోహిత్ శర్మ(9), కామెరూన్ గ్రీన్(1) క్రీజులో ఉన్నారు.
-
7 పరుగులు
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ముంబై బ్యాటర్లు బరిలోకి దిగారు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్లు ఓపెనర్లుగా వచ్చారు. మొదటి ఓవర్‌ను మాథ్యూ షార్ట్ వేయగా ఆఖరి బంతికి రోహిత్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్‌లో మొత్తం 7 పరుగులు వచ్చాయి
-
ముంబై లక్ష్యం 215
వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో సామ్ కరన్(55; 29 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హర్ ప్రీత్ సింగ్ భాటియా(41; 28 బంతుల్లో 4 పోర్లు, 2 సిక్సర్లు) రాణించగా ఆఖర్లో జితేశ్ శర్మ(25; 7 బంతుల్లో 4 సిక్సర్లు) దంచికొట్టడంతో ముంబై ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై బౌలర్లలో కామెరూన్ గ్రీన్, పీయూష్ చావ్లా చెరో రెండు వికెట్లు తీయగా,అర్జున్ టెండూల్కర్, జోఫ్రా ఆర్చర్,జాసన్ బెహ్రెండోర్ఫ్ తలా ఓ వికెట్ పడగొట్టాడు.
-
సామ్ కరన్ అర్ధశతకం.. ఆ వెంటనే ఔట్
జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 26 బంతుల్లో 4పోర్లు, 4 సిక్సర్లతో సామ్ కరన్ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఓవర్‌లోని ఆఖరి బంతికి ఆర్చర్‌కే రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటైయ్యాడు. 19 ఓవర్లకు పంజాబ్ స్కోరు 197/6. జితేశ్ శర్మ(13) క్రీజులో ఉన్నాడు
-
హర్ ప్రీత్ సింగ్ భాటియా ఔట్.
ధాటిగా ఆడే క్రమంలో కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో హర్ ప్రీత్ సింగ్ భాటియా ఔట్(41)క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పంజాబ్ 175 పరుగుల వద్ద(17.4వ ఓవర్) ఐదో వికెట్‌ను కోల్పోయింది. ఈ ఓవర్‌లో సామ్ కరన్ రెండు, జితేశ్ శర్మ రెండు సిక్స్‌లు కొట్టడంతో మొత్తంగా 25 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లకు పంజాబ్ స్కోరు 187/5. సామ్ కరన్ (46), జితేశ్ శర్మ(12) క్రీజులో ఉన్నారు.
-
13 పరుగులు
జోఫ్రా ఆర్చర్ వేసిన 17వ ఓవర్‌లోని మొదటి బంతికి సామ్ కరన్ ఫోర్ కొట్టగా మూడో బంతికి హర్ ప్రీత్ సింగ్ భాటియా సిక్స్ కొట్టాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లకు పంజాబ్ స్కోరు 162/4. సామ్ కరన్ (33), హర్ ప్రీత్ సింగ్ భాటియా(41) క్రీజులో ఉన్నారు.
-
31 పరుగులు
16 ఓవర్‌ను అర్జున్ టెండూల్కర్ వేశాడు. అర్జున్ అనుభలేమిని ఉపయోగించుకుంటూ సామ్ కరన్, హర్ ప్రీత్ సింగ్ భాటియా రెచ్చిపోయి ఆడారు. తొలుత సామ్ కరణ్ ఓ సిక్స్, ఫోర్ కొట్టగా, ఆ తరువాత హర్ ప్రీత్ సింగ్ భాటియా సిక్స్, ఫోర్, ఫోర్ కొట్టాడు. అర్జున్ ఓ నోబాల్ కూడా వేశాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో 31 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లకు పంజాబ్ స్కోరు 149/4. సామ్ కరన్ (28), హర్ ప్రీత్ సింగ్ భాటియా(34) క్రీజులో ఉన్నారు.
-
సామ్ కరన్ సిక్స్
హృతిక్ షోకీన్ వేసిన 15వ ఓవర్‌లోని నాలుగో బంతికి సామ్ కరన్ సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లకు పంజాబ్ స్కోరు 118/4. సామ్ కరన్ (17), హర్ ప్రీత్ సింగ్ భాటియా(16) క్రీజులో ఉన్నారు.
-
సామ్ కరన్ ఫోర్
వరుసగా వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. కామెరూన్ గ్రీన్ వేసిన 14వ ఓవర్‌లోని నాలుగో బంతికి సామ్ కరన్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లకు పంజాబ్ స్కోరు 105/4. సామ్ కరన్ (8), హర్ ప్రీత్ సింగ్ భాటియా(15) క్రీజులో ఉన్నారు.
-
హర్ ప్రీత్ సింగ్ భాటియా ఫోర్
హృతిక్ షోకీన్ బౌలింగ్ వేసిన 13వ ఓవర్‌లోని ఆఖరి బంతికి హర్ ప్రీత్ సింగ్ భాటియా ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లకు పంజాబ్ స్కోరు 97/4. సామ్ కరన్(2), హర్ ప్రీత్ సింగ్ భాటియా(13) క్రీజులో ఉన్నారు.
-
సింగిల్ రన్
కామెరూన్ గ్రీన్ వేసిన 12వ ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. 12 ఓవర్లకు పంజాబ్ స్కోరు 89/4. సామ్ కరన్(1), హర్ ప్రీత్ సింగ్ భాటియా(6) క్రీజులో ఉన్నారు.
-
5 పరుగులు
హృతిక్ షోకీన్ వేసిన ఈ ఓవర్‌లో 5 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లకు పంజాబ్ స్కోరు 88/4. సామ్ కరన్(1), హర్ ప్రీత్ సింగ్ భాటియా(5) క్రీజులో ఉన్నారు.
-
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన పంజాబ్
పంజాబ్ జట్టు కష్టాల్లో పడింది. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. 10వ ఓవర్‌ను చావ్లా వేశాడు. రెండో బంతిని వైడ్‌గా వేయగా తప్పుగా అంచనా వేసిన లివింగ్ స్టోన్(10) ముందుకు వచ్చి షాట్ ఆడేందుకు యత్నించి స్టంపౌట్ కాగా... నాలుగో బంతికి అథర్వ తైడే(29) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 10 ఓవర్లకు పంజాబ్ స్కోరు 83/4. సామ్ కరన్(0), హర్ ప్రీత్ సింగ్ భాటియా(1) క్రీజులో ఉన్నారు.
-
లివింగ్ స్టోన్ సిక్స్
తొమ్మిదో ఓవర్‌ను జోఫ్రా ఆర్చర్ వేశాడు. ఈ ఓవర్‌లోని రెండో బంతికి లివింగ్ స్టోన్ సిక్స్ కొట్టడంతో మొత్తం 10 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లకు పంజాబ్ స్కోరు 81/2. అథర్వ తైడే(29), లివింగ్ స్టోన్(10) క్రీజులో ఉన్నారు.
-
ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఔట్
పంజాబ్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. అర్జున్ టెండూల్కర్ వేసిన 6.4 ఓవర్‌కు ప్రభ్ సిమ్రాన్ సింగ్(26) ఎల్బీగా ఔట్ అయ్యాడు. 7 ఓవర్లకు పంజాబ్ స్కోరు 70 /2, అథర్వ తైడే(28), లివింగ్ స్టోన్(1) క్రీజులో ఉన్నారు.
-
పవర్ ప్లే
పంజాబ్ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే ముగిసింది. ఆరో ఓవర్‌ను పీయూష్ చావ్లా వేశాడు. అథర్వ తైడే, ప్రభ్ సిమ్రాన్ సింగ్ చెరో ఫోర్ కొట్టారు. ఈ ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు పంజాబ్ స్కోరు 58 /1. ప్రభ్ సిమ్రాన్ సింగ్(25), అథర్వ తైడే(19) క్రీజులో ఉన్నారు.
-
10 పరుగులు
ఐదో ఓవర్‌ను జోఫ్రా ఆర్చర్ వేశాడు. అథర్వ తైడే ఓ సిక్స్ కొట్టడంతో ఈ ఓవర్‌లో మొత్తం 10 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు పంజాబ్ స్కోరు 46 /1, ప్రభ్ సిమ్రాన్ సింగ్(20), అథర్వ తైడే(12) క్రీజులో ఉన్నారు.
-
ప్రభ్ సిమ్రాన్ సింగ్ రెండు సిక్స్‌లు
జాసన్ బెహ్రెండోర్ఫ్ నాలుగో ఓవర్ వేయగా ప్రభ్ సిమ్రాన్ సింగ్ రెండు సిక్సర్లు కొట్టాడు. ఈ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు పంజాబ్ స్కోరు 36 /1, ప్రభ్ సిమ్రాన్ సింగ్(19), అథర్వ తైడే(3) క్రీజులో ఉన్నారు.
-
మాథ్యూ షార్ట్ ఔట్
కామెరూన్ గ్రీన్ పంజాబ్ జట్టుకు షాకిచ్చాడు. చావ్లాకు క్యాచ్ ఇచ్చి మాథ్యూ షార్ట్ (11) ఔట్ అయ్యాడు. దీంతో 18 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 3 ఓవర్లకు పంజాబ్ స్కోరు 20 /1, ప్రభ్ సిమ్రాన్ సింగ్(6), అథర్వ తైడే(1) క్రీజులో ఉన్నారు.
-
షార్ట్ ఫోర్
రెండో ఓవర్‌ను జాసన్ బెహ్రెండోర్ఫ్ వేశాడు. ఆఖరి బంతికి మాథ్యూ షార్ట్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. 2 ఓవర్లకు పంజాబ్ స్కోరు 13/0, ప్రభ్ సిమ్రాన్ సింగ్(4), మాథ్యూ షార్ట్(7) క్రీజులో ఉన్నారు.
-
తొలి ఓవర్‌లో 5 పరుగులు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది పంజాబ్. ప్రభ్ సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్ లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. తొలి ఓవర్‌ను అర్జున్ టెండూల్కర్ వేశాడు. ఈ ఓవర్‌లో ఐదు పరుగులు వచ్చాయి.
-
రోహిత్ శర్మ సేన
ముంబై ఇండియన్స్ తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, జాసన్
-
సామ్ కర్రాన్ సేన
పంజాబ్ కింగ్స్ తుది జట్టు: అథర్వ తైడే, ప్రభ్ సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్(కెప్టెన్), జితేశ్ శర్మ, హర్ ప్రీత్ సింగ్ భాటియా, షారుక్ ఖాన్, హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
-
ముంబై ఇండియన్స్ బౌలింగ్
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు వాంఖడే స్టేడియం అనుకూలంగానే ఉంటుందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. అయినా పంజాబ్ ను కట్టడి చేస్తామన్న నమ్మకం ఉందని, ఛేదనలో రాణిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.