IPL 2023, PBKS vs GT: ఆ హిట్ట‌ర్ వ‌చ్చేశాడు.. గుజరాత్‌కు క‌ష్ట‌మే..!

ఐపీఎల్ 2023లో భాగంగా నేడు మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ద‌మైంది. మొహాలీలో గుజ‌రాత్ టైటాన్స్‌తో పంజాబ్ కింగ్స్ ఢీ కొట్ట‌నుంది.

PBKS vs GT

IPL 2023 PBKS Vs GT: ఐపీఎల్ 2023లో భాగంగా నేడు మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ద‌మైంది. మొహాలీలో గుజ‌రాత్ టైటాన్స్‌తో పంజాబ్ కింగ్స్ ఢీ కొట్ట‌నుంది. ఈ సీజ‌న్‌లో ఇరు జ‌ట్లు మూడేసి మ్యాచ్‌లు ఆడాయి. ఇరు జ‌ట్లు రెండు మ్యాచుల్లో విజ‌యం సాధించ‌గా, మ‌రో మ్యాచ్‌లో ఓడిపోయాయి. విజ‌యాల ప‌రంగా స‌మంగా నిలిచిన‌ప్ప‌టికీ మెరుగైన ర‌న్‌రేట్ కార‌ణంగా పాయింట్ల ప‌ట్టిక‌లో గుజ‌రాత్ నాలుగో స్థానంలో ఉండ‌గా, పంజాబ్ ఆరో స్థానంలో కొన‌సాగుతోంది. నేటి మ్యాచ్‌లో విజ‌యం సాధించి త‌మ స్థానాల‌ను మెరుగుప‌ర‌చుకోవాల‌ని ఇరు జ‌ట్లు భావిస్తున్నాయి. సొంత గ‌డ్డ‌పై ఆడుతుండ‌డం పంజాబ్‌కు కాస్త క‌లిసివ‌చ్చే అంశం.

హిట్ట‌ర్ వ‌చ్చేశాడు

ఇంగ్లాండ్ ఆట‌గాడు లియాన్ లివింగ్ స్టోన్ రాక‌తో పంజాబ్ బ్యాటింగ్ బ‌లం పెరిగింది అన‌డంలో సందేహం లేదు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న అత‌డిపైనే అంద‌రి క‌ళ్లు ఉంటాయి. మ‌రో విదేశీ ఆట‌గాడు క‌గిసో ర‌బాడ కూడా వ‌చ్చాడు. స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్‌కే అందుబాటులోకి వ‌చ్చినా తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. నేటి మ్యాచ్‌లో బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది.  ఓపెన‌ర్లుగా ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ లు ఆడ‌నుండ‌గా, వ‌న్‌డౌన్‌లో లివింగ్ స్టోన్ వ‌స్తాడు.

పోయిన మ్యాచ్‌లో భానుక రాజపక్స స్థానంలో ఆడిన మాథ్యూ షార్ట్ ఈ సారి బెంచికే ప‌రిమితం కానున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పుకోద‌గ్గ ఇన్నింగ్స్ ఆడ‌క‌పోయిన‌ప్ప‌టికి సికందర్ రజాకు మ‌రో అవ‌కాశాన్ని ఇచ్చే ఛాన్స్ ఉంది. మిడిల్ ఆర్డ‌ర్ లో షారుక్ ఖాన్‌, జితేశ్ శ‌ర్మ‌, హ‌ర్‌ప్రీత్ బార్, సామ్ క‌ర్ర‌న్‌ల‌తో కూడిన బ్యాటింగ్ విభాగం బ‌లంగానే ఉంది. అయితే.. బౌలింగ్‌లో ఎవ‌రికి తుది జ‌ట్టులో చోటు ద‌క్కుతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా ఉంది. అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు రాహుల్ చ‌హ‌ర్‌లకు తుది జ‌ట్టులో చోటు ఖాయం. క‌గిసో ర‌బ‌డ‌, నాథ‌న్ ఎల్లిస్‌ల‌లో ఒక‌రిని తీసుకోవ‌చ్చు.

IPL 2023, SRH vs PBKS: రాణించిన రాహుల్ త్రిపాఠి.. ఎట్టకేలకు హైదరాబాద్ బోణీ

హార్దిక్ ఆడ‌తాడా..?

అనారోగ్యం కార‌ణంగా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ అయిన హార్థిక్ పాండ్యా ఆడ‌లేదు. అత‌డి స్థానంలో ర‌షీద్ ఖాన్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. అయితే.. పంజాబ్‌తో మ్యాచ్‌కు హార్థిక్ వ‌చ్చేస్తున్నాడు. కెప్టెన్ రాక‌తో గుజ‌రాత్ బ‌లం పెరిగిన‌టైంది. శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియాల‌తో ఏ ఇద్ద‌రు రాణించ‌గా భారీ స్కోరు సాధించ‌వ‌చ్చు. రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, జాషువా లిటిల్‌ల‌ను పంజాబ్ బ్యాట‌ర్లు ఎలా ఎదుర్కొంటారా అన్న‌దానిపైనూ మ్యాచ్ ఆధార‌ప‌డి ఉంది.

IPL 2023: గెలుపు సంగ‌తి అటుంచితే.. ఆట‌గాళ్ల‌ను కాపాడుకోవ‌డ‌మే చెన్నైకి పెద్ద ప‌ని

పిచ్ :

సాధార‌ణంగా పిసిఎ స్టేడియంలోని పిచ్ బ్యాటింగ్‌, బౌలింగ్‌కు స‌మానంగా స‌హ‌క‌రిస్తుంటుంది. క్రీజులో నిల‌దొక్కుకుంటే ప‌రుగుల వ‌ర‌ద పారించ‌వ‌చ్చు. పేస‌ర్ల‌కు స‌హ‌కారం ఉంటుంది. మంచు ప్రభావం ఉండే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకునే అవ‌కాశం ఉంది.

తుది జ‌ట్లు(అంచ‌నా) :

PBKS ప్రాబబుల్ XI: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, సికందర్ రజా/భానుక రాజపక్స, సామ్ కర్రాన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, నాథన్ ఎల్లిస్/కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్

GT ప్రాబబుల్ XI: వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, జాషువా లిటిల్