IPL 2023, SRH vs PBKS: రాణించిన రాహుల్ త్రిపాఠి.. ఎట్టకేలకు హైదరాబాద్ బోణీ

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బౌలింగ్ చేసింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో శిఖర్ ధావన్ ఒక్కడే రాణించాడు.

IPL 2023, SRH vs PBKS: రాణించిన రాహుల్ త్రిపాఠి.. ఎట్టకేలకు హైదరాబాద్ బోణీ

IPL 2023, SRH vs PBKS

Updated On : April 9, 2023 / 11:11 PM IST

IPL 2023, SRH vs PBKS: ఐపీఎల్ 2023లో ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు బోణీ కొట్టింది. ఈ సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ గెలుపొందింది. ఈ సీజన్ లో రెండు వరుస ఓటముల తర్వాత హైదరాబాద్ మ్యాచ్ గెలిచింది.

144 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్.. 17.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టులో రాహుల్ త్రిపాఠీ హాఫ్ సెంచరీతో జట్టుని గెలిపించాడు. త్రిపాఠి 48 బంతుల్లో 74 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరో ఎండ్ లో మార్ క్రమ్ 21 బంతుల్లో 37 పరుగులతో(నాటౌట్) రాణించాడు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 09 Apr 2023 11:01 PM (IST)

    హమ్మయ్య.. హైదరాబాద్ గెలిచింది

    ఐపీఎల్ 2023లో ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు బోణీ కొట్టింది. ఈ సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో హైదరాబాద్ గెలుపొందింది. ఈ సీజన్ లో రెండు వరుస ఓటముల తర్వాత హైదరాబాద్ విజయాన్ని నమోదు చేసింది. కాగా, రెండు వరుస విజయాల తర్వాత పంజాబ్ ఓటమి చవిచూసింది.

  • 09 Apr 2023 10:41 PM (IST)

    14 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 97/2

    14 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది.

  • 09 Apr 2023 10:37 PM (IST)

    రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచరీ.. 13 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 94/2

    13 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచరీ చేశాడు. 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 50 పరుగులు చేశాడు.

  • 09 Apr 2023 10:32 PM (IST)

    12 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 86/2

    12 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 2 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి(43) ధాటిగా ఆడుతున్నాడు.

  • 09 Apr 2023 10:27 PM (IST)

    11 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 78/2

    11 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 2 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది.

  • 09 Apr 2023 10:23 PM (IST)

    10 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 67/2

    10 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 2 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి(31), మార్ క్రమ్(3) క్రీజులో ఉన్నారు.

  • 09 Apr 2023 10:20 PM (IST)

    9 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 55/2

    9 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 2 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది.

  • 09 Apr 2023 09:49 PM (IST)

    ఆచితూచి ఆడుతున్న ఓపెన‌ర్లు

    పంజాబ్ జ‌ట్టు నిర్దేశించిన 144 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్లు బ‌రిలోకి దిగారు. తొలి ఓవ‌ర్‌లో నాలుగు ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గా రెండో ఓవ‌ర్‌లో 9 ప‌రుగులు రాబ‌ట్టారు. అర్ష్ దీప్ సింగ్ వేసిన ఈ ఓవ‌ర్‌లో మ‌యాంక్ అగ‌ర్వాల్ రెండు బౌండ‌రీలు బాదాడు. 2 ఓవ‌ర్లు ముగిసే స‌రికి స్కోరు 13/0. మ‌యాంక్ అగ‌ర్వాల్ 9, హ్యారీ బ్రూక్ 4 ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

  • 09 Apr 2023 09:24 PM (IST)

    ధావ‌న్ 99 నాటౌట్‌.. హైద‌రాబాద్ లక్ష్యం 144

    న‌ట‌రాజ‌న్ వేసిన ఆఖ‌రి ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు వ‌చ్చాయి. ధావ‌న్ 99 ప‌రుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 143 ప‌రుగులు చేసింది. హైద‌రాబాద్ విజ‌య ల‌క్ష్యం 144.

  • 09 Apr 2023 09:04 PM (IST)

    వ‌రుస‌గా రెండు సిక్స‌ర్లు.. ధావ‌న్ హాఫ్ సెంచ‌రీ

    స‌హ‌చ‌రులు వెనుదిరుగుతున్నా శిఖ‌ర్ ధావ‌న్ త‌న పోరాటాన్ని కొన‌సాగిస్తున్నాడు. న‌జ‌రాజ‌న్ వేసిన 16 ఓవ‌ర్‌లోని నాలుగో బంతిని సిక్సర్‌గా మ‌లిచి హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఆ త‌రువాత బంతిని కూడా స్టాండ్స్‌లోకి పంపాడు. దీంతో పంజాబ్ స్కోరు వంద ప‌రుగులు దాటింది. 16 ఓవ‌ర్ల‌కు స్కోరు 101/9. ధావ‌న్ (60), మోహిత్‌(0) ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 09 Apr 2023 08:48 PM (IST)

    రాహుల్ చాహర్ ఔట్‌

    78 ప‌రుగుల వ‌ద్ద పంజాబ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మయాంక్ మార్కండే వేసిన 13 ఓవ‌ర్ ఐదో బంతికి రాహుల్ చ‌హ‌ర్ ఎల్బీగా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ధావ‌న్ 37 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నాడు.

  • 09 Apr 2023 08:39 PM (IST)

    హర్‌ప్రీత్ బ్రార్ ఔట్‌.. ఏడో వికెట్ పాయె

    పంజాబ్ క‌ష్టాలు ఆగేట‌ట్లుగా లేవు. పెవిలియ‌న్‌లో ఏదో ప‌ని ఉన్న‌ట్లుగా ఆ జ‌ట్టు బ్యాట‌ర్లు క్యూ క‌డుతున్నారు. తాజాగా మ‌రో వికెట్ న‌ష్ట‌పోయింది. ఉమ్రాన్ మాలిక్ వేసిన 11.2 ఓవ‌ర్‌కు హర్‌ప్రీత్ బ్రార్(1) ఔట్ అయ్యాడు. 12 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 77/7. శిఖ‌ర్ ధావ‌న్ 36, రాహుల్ చ‌హ‌ర్‌(0) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 09 Apr 2023 08:34 PM (IST)

    ఆగ‌ని వికెట్ల ప‌త‌నం.. ఆరో వికెట్ డౌన్‌

    ఓ వైపు కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ ఆదుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే మ‌రో వైపు వ‌చ్చిన బ్యాట‌ర్లు వ‌చ్చిన‌ట్లే పెవిలియ‌న్‌కు చేరుకుంటున్నారు. ఆదుకుంటాడు అని బావించిన హార్డ్ హిట్ట‌ర్ షారుక్ ఖాన్ కేవ‌లం 4 ప‌రుగులు మాత్ర‌మే చేసి మయాంక్ మార్కండే బౌలింగ్‌లో ఎల్బీగా ఔట్ అయ్యాడు. దీంతో పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది. ఈ ఓవ‌ర్‌లో మూడు ప‌రుగులే వ‌చ్చాయి. 11 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 76/6.

  • 09 Apr 2023 08:29 PM (IST)

    స‌గం వికెట్లు కోల్పోయిన పంజాబ్‌

    మ్యాచ్ ఆరంభం నుంచి హైద‌రాబాద్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో పంజాబ్ బ్యాట‌ర్లు ప‌రుగులు చేసేందుకు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఓ వైపు కెప్టెన్ ధావ‌న్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నా అత‌డికి స‌హ‌క‌రించేవారే క‌రువు అయ్యారు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో సికందర్ రజా(5) మ‌యాంక్ చేతికి చిక్కాడు. దీంతో పంజాబ్ ఐదో వికెట్‌ను కోల్పోయింది. 10 ఓవ‌ర్ల‌కు స్కోరు 73/5. ధావ‌న్ 34, షారుక్ ఖాన్ 4 ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

  • 09 Apr 2023 08:21 PM (IST)

    వికెట్ తీసిన మ‌యాంక్ మార్కండే.. సామ్ క‌ర్రాన్ ఔట్‌

    త‌న తొలి ఓవ‌ర్‌లోనే వికెట్ తీసి హైద‌రాబాద్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాడు మ‌యాంక్ మార్కండే. సామ్ క‌ర్రాన్‌(22; 15 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్స్‌) భువ‌నేశ్వ‌ర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటైయ్యాడు. దీంతో పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఈ ఓవ‌ర్‌లో ఆరు ప‌రుగులు వ‌చ్చాయి. 9 ఓవ‌ర్ల‌కు స్కోరు 64/4.

  • 09 Apr 2023 08:14 PM (IST)

    11 ప‌రుగులు

    న‌ట‌రాజ‌న్ వేసిన ఎనిమిదో ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు వ‌చ్చాయి. మొద‌టి, ఐదో బంతిని ధావ‌న్ బౌండ‌రీకి త‌ర‌లించాడు. 8 ఓవ‌ర్ల‌కు స్కోరు 58/3. ధావ‌న్ 32, సామ్ కర్రాన్ 18 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 09 Apr 2023 08:09 PM (IST)

    ఆరు ప‌రుగులే ఇచ్చిన సుంద‌ర్‌

    తొలి బంతికి సామ్ క‌ర్రాన్ బౌండ‌రీ కొట్టిన‌ప్ప‌టికి వాషింగ్ట‌న్ సుంద‌ర్ కేవ‌లం ఆరు ప‌రుగులే ఇచ్చాడు. 7 ఓవ‌ర్ల‌కి పంజాబ్ స్కోర్ 47/3.

  • 09 Apr 2023 08:04 PM (IST)

    కోలుకున్న పంజాబ్‌.. ముగిసిన ప‌వ‌ర్ ప్లే

    ఆరంభంలో మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన పంజాబ్ జ‌ట్టు ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు కెప్టెన్ ధావ‌న్‌. ఓ వైపు వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికీ త‌న‌దైన శైలిలో బౌండ‌రీలు కొడుతూ స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. అత‌డికి ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్ సామ్ కర్రాన్ చ‌క్క‌ని స‌హ‌కారం అందిస్తున్నాడు. వీరిద్ద‌రు హైద‌రాబాద్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగుతున్నారు. ప‌వ‌ర్ ప్లే ముగిసే స‌రికి పంజాబ్ స్కోరు 41/3. ప్ర‌స్తుతం ధావ‌న్ 21, సామ్ క‌ర్రాన్ 12 ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

  • 09 Apr 2023 07:55 PM (IST)

    జితేశ్ శర్మ ఔట్‌

    ద‌క్షిణాఫ్రికా పేస‌ర్ మార్కో జాన్సెన్ త‌న వ‌రుస ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. జితేశ్ శర్మ(4) కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ కు క్యాచ్ ఇచ్చి ఔటైయ్యాడు. దీంతో పంజాబ్ జ‌ట్ఠు 22 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది. ప్ర‌స్తుతం ఉప్ప‌ల్ మైదానం అభిమానులు కేరింత‌లతో ద‌ద్ద‌రిల్లుతోంది.

  • 09 Apr 2023 07:48 PM (IST)

    క‌ష్టాల్లో పంజాబ్.. రెండో వికెట్ డౌన్‌

    వరుస‌ ఓవ‌ర్ల‌లో పంజాబ్ జ‌ట్టు రెండు వికెట్లు కోల్పోయింది. మార్కో జాన్సెన్ హైద‌రాబాద్‌కు మ‌రో వికెట్ అందించాడు. మాథ్యూ షార్ట్‌(1)ను ఎల్బీగా పెవిలియ‌న్ చేర్చాడు. 2 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 14/2

  • 09 Apr 2023 07:38 PM (IST)

    తొలి ఓవర్లో 9 పరుగులు

    క్రీజులో శిఖర్ ధావన్ 6, మాథ్యూ షార్ట్ 1 పరుగుతో ఉన్నారు. పంజాబ్ కింగ్స్ స్కోరు తొలి ఓవర్లో వికెట్ నష్టానికి 9 పరుగులుగా ఉంది.

  • 09 Apr 2023 07:33 PM (IST)

    ఫస్ట్ బంతికే ప్రభ్‌ సిమ్రాన్ సింగ్ ఔట్

    పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ఫస్ట్ ఓవర్.. ఫస్ట్ బంతికే ప్రభ్‌ సిమ్రాన్ సింగ్ ఔట్ అయ్యాడు. భువనేశ్వర్ కుమార్  బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్, మాథ్యూ షార్ట్ ఉన్నారు.

  • 09 Apr 2023 07:14 PM (IST)

    శిఖర్ ధావన్ టీమ్

    పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌ సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, జితేశ్ శర్మ, షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, నాథన్ ఎల్లిస్, మోహిత్ రాథీ, హర్‌ ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌ దీప్ సింగ్

  • 09 Apr 2023 07:11 PM (IST)

    మార్క్రామ్ టీమ్

    సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్

  • 09 Apr 2023 07:03 PM (IST)

    సన్‌రైజర్స్ బౌలింగ్

    టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులోనూ గెలవకపోతే వరుసగా మూడు మ్యాచులు ఓడిన టీమ్ గా సన్‌రైజర్స్ హైదరాబాద్ అపఖ్యాతి పాలవుతుంది.

  • 09 Apr 2023 06:54 PM (IST)

    భారీ భద్రత

    ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత కల్పించారు. 1,500 మంది పోలీసులు, 340 సీసీ కెమెరాలు, షీ టీమ్స్, మఫ్టీ పోలీసులు, క్విక్ రియాక్షన్ టీమ్స్ తో భద్రత కల్పిస్తున్నారు. బ్లాక్ లో టికెట్లు అమ్మితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మ్యాచ్ కి వచ్చే ప్రేక్షకుల కోసం మెట్రో సేవలను పొడిగించారు. రాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు ఉంటాయి. ఇవాళ రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతి ఇస్తున్నారు.

  • 09 Apr 2023 06:53 PM (IST)

    హ్యాట్రిక్ పై పంజాబ్ గురి

    ఉప్పల్ లో ఆడిన తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. రెండో మ్యాచ్ లో లఖ్​నవూ చేతిలో ఓటమి పాలైంది. నేడు హోమ్ గ్రౌండ్ ఉప్పల్ వేదికగా పంజాబ్ తో తలపడనుంది. రెండు వరుస విజయాలతో పంజాబ్ జోరు మీదుంది. హ్యాట్రిక్ పై గురిపెట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టాలని చూస్తోంది.