IPL 2023: గెలుపు సంగ‌తి అటుంచితే.. ఆట‌గాళ్ల‌ను కాపాడుకోవ‌డ‌మే చెన్నైకి పెద్ద ప‌ని

ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో అంద‌రిది ఓ బాధ అయితే చెన్నై సూప‌ర్ కింగ్స్ ది మ‌రో బాధ‌. అన్ని జ‌ట్లు ప్ర‌త్యర్థుల‌పై ఎలా విజ‌యం సాధించాలా అని ఆలోచిస్తుంటే చెన్నై మాత్రం త‌మ ఆట‌గాళ్లు గాయాల బారిన ప‌డ‌కుండా చూసుకోవ‌డ‌మే పెద్ద ప‌నిగా మారింది. కీల‌క ఆట‌గాళ్లు అంద‌రూ ఒక్కొక్క‌రుగా గాయ‌ప‌డుతుండ‌డం ఆ జ‌ట్టును ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

IPL 2023: గెలుపు సంగ‌తి అటుంచితే.. ఆట‌గాళ్ల‌ను కాపాడుకోవ‌డ‌మే చెన్నైకి పెద్ద ప‌ని

Sisanda Magala

IPL 2023: ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో అంద‌రిది ఓ బాధ అయితే చెన్నై సూప‌ర్ కింగ్స్ ది మ‌రో బాధ‌. అన్ని జ‌ట్లు ప్ర‌త్యర్థుల‌పై ఎలా విజ‌యం సాధించాలా అని ఆలోచిస్తుంటే చెన్నై మాత్రం త‌మ ఆట‌గాళ్లు గాయాల బారిన ప‌డ‌కుండా చూసుకోవ‌డ‌మే పెద్ద ప‌నిగా మారింది. కీల‌క ఆట‌గాళ్లు అంద‌రూ ఒక్కొక్క‌రుగా గాయ‌ప‌డుతుండ‌డం ఆ జ‌ట్టును ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. సీజ‌న్ ప్రారంభంలోనే ఇలా ఉంటే.. మున్ముందు కీల‌క మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌పై ఎలా విజ‌యం సాధించాలా అని ఆలోచించ‌డం కాస్త ప‌క్క‌న బెట్టి త‌మ జ‌ట్టు ఆట‌గాళ్లు గాయాల బారిన ప‌డ‌కుండా చూసుకోవ‌డంపైనే సీఎస్‌కే దృష్టి సారించాల్సిన ప‌రిస్థితులు ఉన్నాయి.

కోట్లు పెట్టి కొనుకున్న దీప‌క్ చాహ‌ర్‌, ఆల్ రౌండ‌ర్ బెన్‌స్టోక్స్‌ల‌తో పాటు సిమ్ర‌న్‌జీత్ సింగ్‌, ముకేశ్ చౌద‌రీ లు గాయ‌ప‌డ‌డంతో ఇప్ప‌టికే వీరి సేవ‌ల‌ను చెన్నై కోల్పోయింది. తాజాగా మ‌రో ఆట‌గాడు గాయ‌ప‌డ్డాడు. బుధ‌వారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో పేస‌ర్ సిసండ మ‌గాలా గాయ‌ప‌డ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న క్ర‌మంలో కుడి చేతి వేలికి దెబ్బ త‌గింది. అత‌డి గాయానికి చికిత్స అందించిన వైద్యులు గాయం తీవ్ర‌త తెలుసుకునేందుకు స్కానింగ్ తీశారు. వైద్యులు అత‌డికి రెండు వారాలు విశ్రాంతి అవ‌స‌రం అని చెప్పారు.

IPL 2023, CSK Vs RR: చెన్నైను చిత్తు చేసిన రాయ‌ల్స్‌

దీప‌క్ చాహ‌ర్‌, బెన్‌స్టోక్స్ వంటి ఆట‌గాళ్లు లేక అంతంత మాత్రంగా ఉన్న సీఎస్ కే బౌలింగ్ విభాగంకు మ‌లాగా గాయం దిక్కుతోచ‌ని ప‌రిస్థితికి తీసుకువ‌చ్చింది. అంత‌గా అనుభ‌వం లేని దేశీయ ఆట‌గాళ్లు అయిన హంగార్గేక‌ర్‌, తుషార్ దేశ్ పాండే, ఆకాశ్ సింగ్‌ల‌తో నెట్టుకురావాల్సి వ‌చ్చింది. ప్రిటోరియ‌స్, ప‌తిర‌ణ వంటి విదేశీ పేస‌ర్లు అందుబాటులో ఉన్న తుది జ‌ట్టులో న‌లుగురు మాత్ర‌మే విదేశీ ఆట‌గాళ్లు ఆడాల్సి ఉండ‌డంతో వీరికి తుది జ‌ట్లులో చోటు దక్క‌తుందా అన్నది అనుమాన‌మే. మ‌రో రెండు వారాల్లో దీప‌క్ చాహ‌ర్ కోలుకుంటార‌ని జ‌ట్టు మేనేజ్‌మెంట్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. మ‌రుస‌టి మ్యాచ్‌కు బెన్‌స్టోక్స్ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే.. మోకాలి గాయంతో ఇబ్బంది ప‌డుతున్న నేప‌థ్యంలో అత‌డు బౌలింగ్ చేయ‌లేని ప‌రిస్థితి ఉంది. ఈ సీజ‌న్‌కు కేవ‌లం బ్యాట‌ర్‌గానే అందుబాటులో ఉంటాన‌ని స్టోక్స్ ఇప్ప‌టికే వెల్ల‌డించాడు. మ‌రీ ఎంతో అనుభ‌వం ఉన్న ధోని ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటాడో వేచి చూడాల్సిందే.

MS Dhoni: ఐపీఎల్‌లో ధోని ద్విశ‌త‌కం.. కెప్టెన్ కూల్ ఘ‌న‌త‌