IPL 2024 : కేకేఆర్ జట్టు విజయంలో కీలక భూమిక పోషించిన హర్షిత్ రానాకు బిగ్‌షాక్‌!

హర్షిత్ రాణా చివరి ఓవర్లలో అద్భుతమైన బంతులతో బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించడంతో కేకేఆర్ విజయం ఖాయమైంది.

Harshit Rana

Harshit Rana fined: కేకేఆర్ జట్టు ప్లేయర్ హర్షిత్ రాణాకు ఐపీఎల్ నిర్వాహకులు బిగ్‌షాకిచ్చారు. మ్యాచ్ ఫీజులో 60శాతం జరిమానా విధించారు. శనివారం ఈడెన్ గార్డెన్ లో కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్ హెచ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చివరి బాల్ వరకు ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడింది. చివరి బాల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ బంతిని బౌండరీకి తరలించే క్రమంలో విఫలం కావడంతో కేకేఆర్ జట్టు నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. కేకేఆర్ విజయంలో బ్యాటింగ్ లో రసూల్, బౌలింగ్ లో హర్షిత్ రానా కీలక భూమిక పోషించారు.

Also Read : IPL 2024 : వేలంలో రికార్డు ధర.. తొలి మ్యాచ్‌లో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు.. మీమ్స్‌తో ఆడుకుంటున్న నెటిజన్లు

హర్షిత్ రానా చివరి ఓవర్లలో అద్భుతమైన బంతులతో బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించడంతో కేకేఆర్ విజయం ఖాయమైంది. చివరి ఓవర్లో ఆరు బాల్స్ కు 13 పరుగులు కొట్టాల్సి ఉంది. క్రీజులో హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. అప్పటికే వరుసగా సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. చివరి ఓవర్లో షాబాజ్, క్లాసెన్ వికెట్లు తీసిన హర్షిత్ రానా కేకేఆర్ విజయంలో కీలక భూమిక పోషించాడు. అయితే, 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్ హెచ్ కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో ఫస్ట్ స్పెల్ వేసిన హర్షిత్ రానాను అగర్వాల్ టార్గెట్ చేశాడు. వరుస బౌండరీలతో రానాను మయాంక్ ఒత్తిడిలోకి నెట్టాడు. దీంతో రానా తొలి రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

Also Read : IPL 2024 : పాపం కావ్య పాప..! నాలుగు బంతుల్లో మారిపోయిన రియాక్షన్.. వీడియో వైరల్

కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మరోసారి హర్షిత్ రానాకు బంతి ఇచ్చాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో రానా బౌలింగ్ లో మయాంక్ భారీ షాట్ కు యత్నించి అవుట్ అయ్యాడు. వికెట్ తీసిన సంతోషంలో హర్షిత్ రానా మయాంక్ దగ్గరకు వెళ్లి సీరియస్ గా చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఐపీఎల్ నిర్వాహకులు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినట్లుగా గుర్తించి మ్యాచ్ ఫీజులో 60శాతం జరిమానా విధించారు. మ్యాచ్ సమయంలో రానా ఆర్టికల్ 2.5 లెవల్ 1 నేరాలకు పాల్పడ్డాడు. దీంతో మ్యాచ్ రిఫరీ ఆదేశాల మేరకు 10శాతం, 50శాతం లెక్కన రెండు తప్పిదాలకు జరిమానా విధించారు.

 

ట్రెండింగ్ వార్తలు