IPL 2024 : వేలంలో రికార్డు ధర.. తొలి మ్యాచ్‌లో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు.. మీమ్స్‌తో ఆడుకుంటున్న నెటిజన్లు

ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ అందుకు తగ్గట్లుగా ప్రదర్శన చేయడంలో విఫలమవడం ఆనవాయితీగా వస్తుంది.

IPL 2024 : వేలంలో రికార్డు ధర.. తొలి మ్యాచ్‌లో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు.. మీమ్స్‌తో ఆడుకుంటున్న నెటిజన్లు

Mitchell Starc and pat cummins

KKR vs SRH Match In IPL 2024 : ఐపీఎల్ వేలంలో ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు రికార్డు ధర పలికారు. కేకేఆర్ జట్టు మిచెల్ స్టార్క్ ను రూ. 24.75 కోట్ల రికార్డు ధరతో కొనుగోలు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కమిన్స్ ను రూ. 20.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఇద్దరు ప్లేయర్లు శనివారం రాత్రి కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్ హెచ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆడారు. కానీ, ఆశించిన స్థాయిలో వీరిద్దరూ రాణించక పోవటంతో ఆయా జట్ల అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు.

Also Read : IPL 2024 : పాపం కావ్య పాప..! నాలుగు బంతుల్లో మారిపోయిన రియాక్షన్.. వీడియో వైరల్

కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్ హెచ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి బాల్ వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు 208 పరుగులు భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్ హెచ్ కెప్టెన్ గా కమిన్స్ ఉన్నాడు. కేకేఆర్ జట్టు భారీ స్కోర్ ను కట్టడి చేయడంలో అతని వ్యూహాలు పనిచేయలేదు. అంతేకాక.. కమిన్స్ నాలుగు ఓవర్లు వేశాడు.. కేవలం ఒక వికెట్ మాత్రమే పడగొట్టి 32 పరుగులు ఇచ్చాడు. అంతేకాదు.. చివరి బంతికి ఐదు పరుగులు కొట్టాల్సిన స్థితిలో షాట్ ఆడడంలో కమిన్స్ విఫలమయ్యాడు. కమిన్స్ చివరి బంతిని సిక్స్ కొట్టిఉంటే ఎస్ఆర్‌హెచ్‌ జట్టు విజయం సాధించి ఉండేది. అలాకాకపోయిన ఫోన్ కొట్టిన మ్యాచ్ డ్రా అయ్యి ఉండేది. అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ కమిన్స్ విఫలం కావటంతో ఎస్ఆర్‌హెచ్‌ జట్టు ఓటమికి కారణమైంది.

Also Read : KKR vs SRH : బోణీ కొట్టిన కోల్‌కతా.. తొలి మ్యాచ్‌లో పోరాడి ఓడిన హైదరాబాద్..!

ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ అందుకు తగ్గట్లుగా ప్రదర్శన చేయడంలో విఫలమవడం ఆనవాయితీగా వస్తుంది. తాజాగా కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ బౌలర్ మిచెల్ స్టార్క్ (రూ. 24.75 కోట్లు రికార్డు ధర) ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. నాలుగు ఓవర్లు వేసిన మిచెల్ స్టార్క్ ఒక్క వికెట్ తీయకపోగా.. 53 భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 19 ఓవర్లో స్టార్క్ బౌలింగ్ వేయగా.. క్లాసెన్ సిక్సుల వర్షం కురిపించాడు. కేకేఆర్ విజయం ఖాయమైన తరుణంలో స్టార్క్ వేసిన ఓవర్ ఎస్ఆర్‌హెచ్‌ జట్టు విజయావకాశాలను మెరుగుపర్చింది. చివరి ఓవర్లో హర్షిత్ మెరుగైన బౌలింగ్ తో ఎస్ఆర్‌హెచ్‌ జట్టు విజయాన్ని అడ్డుకున్నాడు. లేకుంటే మిచెల్ స్టార్క్ పుణ్యాన తొలి మ్యాచ్ లో కేకేఆర్ జట్టు ఓటమి పాలయ్యేది. ఇద్దరు అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు విఫలం కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మిమ్స్ తో కామెంట్లు చేస్తున్నారు.