IPL 2024 : ఒంటిచేత్తో రవి బిష్ణోయ్ అద్భుత క్యాచ్.. వీడియో చూస్తే మతి పోవాల్సిందే

లక్నో బౌలర్ రవి బిష్ణోయ్ ఒంటిచేత్తో పట్టిన క్యాచ్ హైలెట్ గా నిలిచింది. గుజరాత్ ఇన్నింగ్స్ లో 56 పరుగుల వద్ద రవి బిష్ణోయ్ బౌలింగ్ లో కేన్ విలియమ్సన్ కాటన్ బౌల్డ్ అయ్యారు.

Rravi Bishnoi

Ravi Bishnoi : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. స్టాయినిస్ 58 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. 164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆదిలో మంచి ప్రారంభం లభించినప్పటికీ తరువాత బ్యాటర్లు సద్వినియోగం చేసుకోలేక పోయారు. దీంతో కేవలం 18.5 ఓవర్లకు 130 పరుగులకే ఆలౌట్ కావడంతో లక్నో జట్టు విజేతగా నిలిచింది.

Also Read : IPL 2024 : గుజరాత్‌‌ చిత్తు.. లక్నో హ్యాట్రిక్ విజయం.. ముచ్చటగా మూడోసారి..!

లక్నో జట్టు తొలి మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ వరుసగా మూడు మ్యాచ్ లలో విజేతగా నిలిచింది. ఆ జట్టు మొత్తం ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిచి ఒక మ్యాచ్ ఓడింది. దీంతో ఆరు పాయిట్లతో మూడో స్థానంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్ జట్టు ఆడిన ఐదు మ్యాచ్‌లలో రెండు గెలిచి మూడు మ్యాచ్ లు ఓడిపోయింది. నాలుగు పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది. లక్నో విజయంలో కీలక భూమిక పోషించిన యశ్ ఠాకూర్ (5/30)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Also Read : MI ESA Day : ముంబై ఇండియన్స్ ఈఎస్ఏ డే మ్యాచ్ : 18వేల మంది చిన్నారులతో వీక్షించిన నీతా అంబానీ.. వాంఖడేలో సందడే సందడి!

ఈ మ్యాచ్ లో లక్నో బౌలర్ రవి బిష్ణోయ్ ఒంటిచేత్తో పట్టిన క్యాచ్ హైలెట్ గా నిలిచింది. గుజరాత్ ఇన్నింగ్స్ లో 56 పరుగుల వద్ద రవి బిష్ణోయ్ బౌలింగ్ లో కేన్ విలియమ్సన్ కాటన్ బౌల్డ్ అయ్యారు. విలియమ్సన్ కొట్టిన షాట్ ను బిష్ణోయ్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. బిష్ణోయ్ పట్టిన క్యాచ్ కు విలియమ్సన్ షాక్ కు గురయ్యాడు. ఔట్ అని తెలుసుకొని పెవిలియన్ బాట పట్టాడు. బిష్ణోయ్ క్యాచ్ పట్టిన సమయంలో స్టేడియంలోఉన్న ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. బిష్ణోయ్ ఒంటిచేత్తో పట్టిన క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సూపర్ క్యాచ్ అంటూ కితాబిస్తున్నారు.

Also Read : MI vs DC : ఎట్ట‌కేల‌కు బోణీ కొట్టిన ముంబై ఇండియ‌న్స్‌.. ఢిల్లీ పై ఘ‌న విజ‌యం