ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌కి సర్వం సిద్ధం.. భారీ బందోస్తు.. వీటిని అనుమతించరు..

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్ల జరిగే ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లేవారు.. ఈ ఐటెమ్స్ తీసుకురావొద్దని పోలీసులు సూచించారు.

IPL 2024 MI vs SRH : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో బుధవారం రాత్రి స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్ల మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నిర్వ‌హ‌ణ‌కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మ్యాచ్ సందర్భంగా అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రోరైళ్లు నడుస్తాయి. టీఎస్ఆర్టీసీ కూడా ప్ర‌త్యేకంగా బ‌స్సులు నడపనుంది. బ్లాక్ టికెట్స్ విక్రయాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మ్యాచ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే..
ఉప్పల్ స్టేడియంలో 39 వేల మంది కెపాసిటీ
స్టేడియం బయట.. లోపల బందోబస్తు ఉంటుంది
2 వేల 5 వందల మంది పోలీసులతో బందోబస్తు
360 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం
కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సెక్యూరిటీ మానిటర్ చేస్తాం

స్టేడియం వద్దకు బ్యాగులు, లగేజ్ తీసుకురావొద్దు
కెమెరాలు, సిగరెట్స్, బైనక్యులర్స్, హెల్మెట్స్, ఫుడ్‌ని స్టేడియం లోపలికి అనుమతించం
షీ టీమ్స్ మఫ్టీలో ఉంటాయి
ఆక్టోపస్ టీమ్స్ కూడా బందోబస్తులో ఉంటాయి

Also Read: హార్దిక్ పాండ్యా.. ఇదేం పని.. ఆశ్చర్యపోయిన మహమ్మద్ షమీ

గ్రౌండ్ లోపల వెండర్స్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ధరకు అమ్మకూడదు
సాయంత్రం 4:30 గంటల నుంచి ప్రేక్షకులను గ్రౌండ్ లోకి అనుమతిస్తాం
రేపు సాయంత్రం స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలుంటాయి
హెవీ వెహికిల్స్ ని అనుమతించం
4 వేల కార్లు, 6 వేల బైక్స్ పార్కింగ్ పెట్టుకోవడానికి ఏర్పాట్లు చేశాం

Also Read: హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మ్యాచ్.. టీఎస్ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు.. పూర్తి వివరాలు

ట్రెండింగ్ వార్తలు