హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మ్యాచ్.. టీఎస్ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు.. పూర్తి వివరాలు

SRH vs MI: తిరిగి రాత్రి 11.30 గంటలకు స్టేడియం నుంచి ఈ బస్సులు బ‌య‌లుదేరుతాయని తెలిపారు. హైదరాబాద్‌లో...

హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మ్యాచ్.. టీఎస్ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు.. పూర్తి వివరాలు

SRH vs MI

ఐపీఎల్-2024లో భాగంగా హైదరాబాద్, ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీంతో టీఎస్ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేసింది. వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి 60 ప్రత్యేక బ‌స్సుల‌ను న‌డుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు.

బుధవారం సాయంత్రం 6 గంట‌లకు ఆయా ప్రాంతాల నుంచి ప్రారంభ‌మై, తిరిగి రాత్రి 11.30 గంటలకు స్టేడియం నుంచి ఈ బస్సులు బ‌య‌లుదేరుతాయని తెలిపారు. హైదరాబాద్‌లో మొత్తం 7 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే.

బుధవారం ముంబై vs హైదరాబాద్, ఏప్రిల్ 5న చెన్నై vs హైదరాబాద్, ఏప్రిల్ 25న బెంగుళూరు vs హైదరాబాద్, మే 2న రాజస్థాన్ vs హైదరాబాద్, మే 8న లక్నో vs హైదరాబాద్, మే 16న గుజరాత్ vs హైదరాబాద్, మే 19న పంజాబ్ vs హైదరాబాద్ మ్యాచులు జరుగుతాయి. ఈ ఏడు మ్యాచులను ఉప్పల్ స్టేడియంలో నిర్వహిస్తారు.

ఈ రూట్లలో ఇలా..

Also Read: పాండ్యా ముందు వచ్చుంటే.. మ్యాచ్‌ మరోలా ఉండేది: మహమ్మద్ షమీ