IPL 2024 : మూడో మ్యాచ్‌లోనూ ఓడిపోయిన ముంబై జట్టు.. హార్ధిక్ కెప్టెన్సీ ఊడినట్లేనా!

ఐపీఎల్ 2024టోర్నీలో హార్దిక్ పాండ్య నేతృత్వంలోని ముంబయి ఇండియన్స్ కు మరో పరాభవం ఎదురైంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు సునాయాస విజయం సాధించింది.

Hardik Pandya

MI vs RR IPL 2024 : ఐపీఎల్ 2024టోర్నీలో భాగంగా హార్దిక్ పాండ్య నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టుకు మరో పరాభవం ఎదురైంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు సునాయాస విజయం సాధించింది. సోమవారం రాత్రి ముంబై, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత ముంబై జట్టు బ్యాటింగ్ చేసింది. ఆదినుంచి ఆ జట్టు బ్యాటర్లు తడబడ్డారు. బౌల్ట్ బౌలింగ్ దాటికి తొలి ఓవర్లోనే ముంబై జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, నమన్ దీర్ వెంటవెంటనే డకౌట్ రూపంలో వెనుదిరిగారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ బ్రెవిస్ కూడా డకౌట్ కావటంతో ముంబై జట్టు 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిపోయింది. దూకుడుగా ఆడుతూ కనిపించిన ఇషాన్ కిషన్ (16) సైతం తక్కువ స్కోర్ కు ఔట్ అయ్యాడు. హార్ధిక్ పాండ్యా, తిలక్ వర్మ లు పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. కానీ, తిలక్ వర్మ (32), హార్దిక్ పాండ్యా (34) ఔట్ కాగా.. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లుసైతం పెద్దగా పరుగులు రాబట్టలేక పోయారు. దీంతో నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ముంబై జట్టు 125 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Also Read : హైదరాబాద్‌లో సీఎస్కే జట్టు.. ధోనీ ధోనీ అంటూ అభిమానుల కేకలు.. ధోనీ మాత్రం సైలెంట్‌గా..

126 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ బ్యాటర్లు యశస్వీ జైస్వాల్, బట్లర్ దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో జైస్వాల్ (10) ఔట్ అయ్యాడు. బట్లర్ (13) సైతం కొద్దిసేపటికే ఔట్ కావడంతో ముంబై జట్టు కాస్త ఊపిరిపీల్చుకుంది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన శాంసన్ తో కలిసి రియాన్ పరాగ్ దూకుడుగా ఆడాడు. శాంసన్ (12) ఔట్ అయిన తరువాత శుభమ్ దూబె (8 నాటౌట్)తో కలిసి పరాగ్ మ్యాచ్ ను పూర్తి చేశాడు. అతను కేవలం 39బంతుల్లోనే 54 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. వరుసగా మూడోసారి ఓటమితో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో కిందిస్థానంలోకి వెళ్లిపోయింది. టోర్నీలో అన్నిజట్లు ఖాతా తెరిచినప్పటికీ ముంబై జట్టు మాత్రం ఒక్క మ్యాచ్ లోకూడా విజయం సాధించలేక పోయింది. మూడు మ్యాచ్ లలో వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ జట్టు అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

Also Read : Sourav Ganguly : పంత్ హాఫ్ సెంచ‌రీ పై గంగూలీ కామెంట్స్‌.. ఇంత‌కంటే మంచి ఇన్నింగ్స్‌లు ఎన్ని ఆడినా కూడా..

ముంబై జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించినప్పటి నుంచి యాజమాన్యం నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ లో ముంబై జట్టును ఐదు సార్లు టోర్నీ విజేతగా నిలిపిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ కు జట్టు పగ్గాలు అప్పగించడంపై రోహిత్ ఫ్యాన్స్ తో పాటు సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడిన హార్దిక్ పాండ్యాకు వ్యతిరేకంగా స్టేడియంలో ప్రేక్షకులు నినాదాలు చేస్తున్నారు. ముంబై జట్టు సొంతగడ్డ వాంఖడే స్టేడియంలోనూ పాండ్యాకు ప్రేక్షకుల నుంచి ఇబ్బంది తప్పలేదు. ఈ క్రమంలో రోహిత్ శర్మ ప్రేక్షకులను కామెంట్ల చేయొద్దంటూ వారించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరుసగా మూడు మ్యాచ్ లలో జట్టు ఓవడిపోవటంతో హార్ధిక్ పై మరింత ఒత్తిడి పెరిగిందని చెప్పొచ్చు. పరిస్థితి పూర్తిగా చేజారక ముందే ముంబై జట్టు యాజమాన్యం హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించి రోహిత్ శర్మకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని ముంబై జట్టు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా జట్టు యాజమాన్యంకు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో.. ముంబై జట్టు యాజమాన్యం పాండ్యానే కెప్టెన్ గా కొనసాగిస్తుందా.. మరొకరికి జట్టు పగ్గాలు అప్పగిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

 

 

 

ట్రెండింగ్ వార్తలు