Sourav Ganguly : పంత్ హాఫ్ సెంచ‌రీ పై గంగూలీ కామెంట్స్‌.. ఇంత‌కంటే మంచి ఇన్నింగ్స్‌లు ఎన్ని ఆడినా కూడా..

రిష‌బ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడ‌డం పై టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ ఆనందం వ్య‌క్తం చేశాడు.

Sourav Ganguly : పంత్ హాఫ్ సెంచ‌రీ పై గంగూలీ కామెంట్స్‌.. ఇంత‌కంటే మంచి ఇన్నింగ్స్‌లు ఎన్ని ఆడినా కూడా..

Sourav Ganguly On Rishabh Pants 51

Sourav Ganguly – Rishabh Pant : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ గెలుపు బోణీ కొట్టింది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. ఢిల్లీ విజ‌యం సాధించ‌డంలో ఆ జ‌ట్టు కెప్టెన్ రిష‌బ్ పంత్ కీల‌క పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో పంత్ అర్థ‌శ‌త‌కంతో రాణించాడు. 2022 డిసెంబ‌ర్‌లో రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన పంత్‌.. ఈ ఐపీఎల్ సీజ‌న్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. రీ ఎంట్రీలో అత‌డికి ఇదే మొద‌టి అర్థ‌శ‌త‌కం కావ‌డం విశేషం.

ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న పంత్ 159.38 స్ట్రైక్‌రేటుతో 51 ప‌రుగులు చేశాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్స‌ర్లు ఉన్నాయి. కాగా.. మెరుపు ఇన్నింగ్స్ ఆడ‌డం పై టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ ఆనందం వ్య‌క్తం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌ను పంత్ త‌న జీవితాంతం గుర్తుకు ఉంచుకుంటాడ‌ని తెలిపాడు.

MS Dhoni : ఢిల్లీపై విధ్వంసం.. 10 ఏళ్ల క్రితం నాటి ధోని ట్వీట్ వైర‌ల్..

‘బాగా ఆడావు పంత్‌. ఈ ఇన్నింగ్స్‌ను నీ జీవితంలో చాల కాలం పాటు గుర్తుంచుకుంటావు. ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఇప్ప‌టికే నువ్వు ఎన్నో ఆడావు. భ‌విష్య‌త్తులో ఇంత‌కంటే మంచి ఇన్నింగ్స్‌లు ఇంకెన్నో ఆడ‌తావు. అయిన‌ప్ప‌టికీ కూడా ఈ ఇన్నింగ్స్ నీకు ఎంతో ప్ర‌త్యేక‌మైంది.’ అంటూ గంగూలీ సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల కోల్పోయి 191 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ డేవిడ్ వార్నర్ (52; 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), రిషబ్ పంత్‌ (51; 32 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్స‌ర్లు) లు హాఫ్ సెంచ‌రీలు బాదారు. పృథ్వీ షా (43; 27 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చెన్నై బౌల‌ర్ల‌లో ప‌తిర‌ణ మూడు వికెట్లు సాధించాడు. ర‌వీంద్ర జ‌డేజా, ముస్తాఫిజుర్ చెరో వికెట్ తీశారు.

IPL 2024 : ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో ఈ విష‌యాన్ని గ‌మ‌నించారా..? సొంత మైదానంలో ఆడితే గెలుపు త‌థ్యం..!

కాగా.. ల‌క్ష్య‌ఛేద‌న‌లో చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి 171 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. చెన్నై బ్యాట‌ర్ల‌లో అజింక్య రహానె (45; 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ధోనీ (37; 16 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్స‌ర్లు) వేగంగా ఆడిన‌ప్ప‌టికీ మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో 20 ప‌రుగుల తేడాతో చెన్నైకి ఓట‌మి త‌ప్ప‌లేదు.