IPL 2024 : ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో ఈ విష‌యాన్ని గ‌మ‌నించారా..? సొంత మైదానంలో ఆడితే గెలుపు త‌థ్యం..!

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో మ్యాచ్‌లు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి.

IPL 2024 : ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో ఈ విష‌యాన్ని గ‌మ‌నించారా..? సొంత మైదానంలో ఆడితే గెలుపు త‌థ్యం..!

Have you noticed this in this IPL season

IPL : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో మ్యాచ్‌లు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 13 మ్యాచులు పూర్తి అయ్యాయి. కొన్ని జ‌ట్లు రెండు మ్యాచులు ఆడ‌గా, మిగిలిన జ‌ట్లు మూడు మ్యాచులు ఆడేశాయి. మొత్తం 10 జ‌ట్ల‌లో ఒక్క ముంబై ఇండియ‌న్స్ త‌ప్ప మిగిలిన జ‌ట్లు అన్నీ గెలుపు బోణీ కొట్టాయి. ముంబై మాత్రం ఆడిన రెండు మ్యాచుల్లో ఓట‌మిపాలైంది. ముంబై త‌న మొద‌టి మ్యాచ్ ను గుజ‌రాత్ తో ఆడింది. ఈ మ్యాచ్‌లో ఆరు ప‌రుగుల తేడాతో ఓడిపోయింది.

ఇక రెండో మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో 31 ప‌రుగుల తేడాతో ఓట‌మి చ‌విచూసింది. ముంబై ఇప్ప‌టి వ‌ర‌కు పాయింట్ల ఖాతా తెర‌వ‌లేదు. ఈ క్ర‌మంలో పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్థానంలో కొన‌సాగుతోంది. కాగా.. ఈ రెండు మ్యాచ్‌ల‌ను ముంబై జ‌ట్టు సొంత మైదానంలో ఆడ‌లేదు. ప్ర‌త్య‌ర్థి సొంత మైదానంలోనే ఆడింది.

సొంత మైదానంలో ఆడితే గెలుపు త‌థ్యం..!

17వ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 13 మ్యాచులు పూర్తి అయ్యాయి. ఈ మ్యాచుల ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తే ఓ విష‌యం మాత్రం అర్థ‌మ‌వుతోంది. అదేమిటంటే 13 మ్యాచుల్లో 12 సొంత మైదానంలో ఆడిన జ‌ట్లే గెలుపొందాయి. ఒక్క రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మాత్ర‌మే ఓడిపోయింది. మార్చి 29న చిన్న‌స్వామి స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఏడు వికెట్ల తేడాతో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ చేతిలో ఓట‌మిని చ‌విచూసింది.

BAN vs SL : కామెడీ ఎర్ర‌ర్స్‌.. ఒక్క క్యాచ్.. ముగ్గురు స్లిప్ ఫిల్డ‌ర్లు.. న‌వ్వులే న‌వ్వులు

విరాట్ కోహ్లి(83; 59 బంతుల్లో 4 ఫోర్లు, 4సిక్స‌ర్లు) విజృంభించిన ఈ మ్యాచ్‌లో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 182 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బ్యాట‌ర్ల‌లో కోహ్లి కాకుండా కామెరూన్ గ్రీన్ (33; 21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), మాక్స్‌వెల్ (28; 19 బంతుల్లో 3 పోర్లు, 1సిక్స్‌), దినేశ్ కార్తిక్ (20; 8 బంతుల్లో 3సిక్స‌ర్లు) రాణించారు.

అయితే.. బ్యాట‌ర్లు విజృంభించ‌డంతో ఈ ల‌క్ష్యాన్ని కోల్‌క‌తా 16.5 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. నైట్‌రైడ‌ర్స్ బ్యాట‌ర్ల‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్ (50; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కం బాద‌గా సునీల్ న‌రైన్ (47; 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), శ్రేయ‌స్ అయ్య‌ర్ (39నాటౌట్; 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ఫిల్ సాల్ట్ (30; 20బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ధాటిగా ఆడారు.

Rishabh Pant : గెలుపు జోష్‌లో ఉన్న పంత్‌కు భారీ షాక్‌.. మ‌రోసారి ఇలాగే జ‌రిగితే..!

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో భాగంగా నేడు సోమ‌వారం(ఏప్రిల్ 1) ముంబై ఇండియ‌న్స్‌తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముంబైలోని వాంఖ‌డే వేదిక కానుంది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిచి పాయింట్ల ఖాతాను తెరిచి హోం గ్రౌండ్ సెంటిమెంట్‌ను కొన‌సాగిస్తుందా..? లేదంటే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం సాధిస్తుందా అన్న‌ది చూడాల్సిందే.