MS Dhoni : ఢిల్లీపై విధ్వంసం.. 10 ఏళ్ల క్రితం నాటి ధోని ట్వీట్ వైర‌ల్..

మ‌హేంద్ర సింగ్ ధోని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

MS Dhoni : ఢిల్లీపై విధ్వంసం.. 10 ఏళ్ల క్రితం నాటి ధోని ట్వీట్ వైర‌ల్..

MS Dhoni 10 year old tweet

MS Dhoni 10 year old tweet : మ‌హేంద్ర సింగ్ ధోని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అత‌డి పేరు చెబితే చాలు అభిమానులు ఉర్రూత‌లు ఊగిపోతారు. ప్ర‌త్య‌ర్థులు వ‌ణికిపోతారు. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు 2020 ఆగ‌స్టు 15న వీడ్కోలు చెప్పిన ఈ దిగ్గ‌జ ఆట‌గాడు ఐపీఎల్ మాత్ర‌మే ఆడుతున్నాడు. ఈ సీజ‌న్‌కు ముందు కెప్టెన్సీని వ‌దిలివేసిన అత‌డు వికెట్ కీప‌ర్‌, బ్యాట‌ర్‌గా మాత్ర‌మే కొన‌సాగుతున్నాడు. ఆదివారం విశాఖ వేదిక‌గా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ చేతిలో చెన్నై ఓడిపోయింది.

ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయిన‌ప్ప‌టికీ సీఎస్‌కే అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. నలభై రెండేళ్ల వయసులోనూ ధోని ధ‌నాధ‌న్ ఇన్సింగ్స్ ఆడడ‌మే అందుకు కార‌ణం. ఈ మ్యాచ్‌లో 16 బంతుల‌ను ఎదుర్కొన్న మ‌హేంద్రుడు నాలుగు ఫోర్లు, మూడు సిక్స‌ర్లు బాది 37 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపు ఇన్నింగ్స్ ను ధోని ఆడ‌డంతో ఆయ‌న 10 ఏళ్ల క్రితం సోష‌ల్ మీడియాలో చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

IPL 2024 : ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో ఈ విష‌యాన్ని గ‌మ‌నించారా..? సొంత మైదానంలో ఆడితే గెలుపు త‌థ్యం..!

ధోని సోష‌ల్ మీడియాలో పెద్ద‌గా యాక్టివ్‌గా ఉండ‌డు అన్న సంగ‌తి తెలిసిందే. అప్పుడ‌ప్పుడూ పోస్ట్‌లు చేస్తుంటాడు. కాగా.. మార్చి 24న 2014 అత‌డు చేసిన ఓ ట్వీట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ‘ఏ జ‌ట్టు గెలిచింది అన్న‌ది అన‌వ‌స‌రం. తాను ఇక్క‌డ ఉన్న‌ది అభిమానుల‌ను అల‌రించేందుకే.’ అని అప్పుడు ధోని ట్వీట్ చేశాడు.

ఆదివారం ఢిల్లీతో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయిన‌ప్ప‌టికీ అభిమానుల‌ను మాత్రం ధోని అల‌రించ‌డంతో ఈ ట్వీట్ మ‌రోసారి వైర‌ల్‌గా మారింది. కాగా.. ఈ మ్యాచ్‌లో ఆఖ‌రి ఓవ‌ర్‌లోని రెండో బంతికి ధోని ఒంటిచేత్తో కొట్టిన సిక్స్ మ్యాచ్‌కే హైలెట్ అని చెప్ప‌వ‌చ్చు.

BAN vs SL : కామెడీ ఎర్ర‌ర్స్‌.. ఒక్క క్యాచ్.. ముగ్గురు స్లిప్ ఫిల్డ‌ర్లు.. న‌వ్వులే న‌వ్వులు