IPL 2025: నేను క్యాచ్ వదిలినప్పుడు KL రాహుల్ నాతో ఇలా అన్నాడు.. అక్షర్ కెప్టెన్సీపై మాట్లాడుతూ అభిషేక్ పోరెల్ ఆసక్తికర విషయాలు చెప్పాడు..

మ్యాచ్ అనంతరం ఆర్ఆర్ జట్టు ప్లేయర్ అభిషేక్ పోరెల్ మాట్లాడుతూ అక్షర్ పటేల్ కెప్టెన్సీ, కేఎల్ రాహుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు.

IPL 2025 (Courtesy BCCI)

IPL 2025: ఐపీఎల్‌ 2025లో భాగంగా విశాఖపట్టణం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్ల వద్ద 163 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్‌ స్టార్క్‌ ఈ మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసి సన్‌రైజర్స్ జట్టుకు బిగ్ షాకిచ్చాడు. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 16ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో సన్ రైజర్స్ జట్టును చిత్తుచేసింది.

Also Read: IPL 2025: ధోని-అశ్విన్ ‘మాస్టర్ ప్లాన్’.. నితీశ్ రాణాను ఎలా ఔట్ చేశారో చూడండి.. వీడియో వైరల్

మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అభిషేక్ పోరెల్ మాట్లాడుతూ అక్షర్ పటేల్ గురించి చెప్పాడు. అక్షర్ పటేల్ మైదానం వెలుపల చాలా ఫన్నీగా ఉంటాడు. మైదానంలో కూడా అతను ఆటగాళ్లను ప్రోత్సహిస్తాడు. మొత్తంమీద అతని కెప్టెన్సీ చాలా బాగుంది. నేను అతని కెప్టెన్సీని చాలా ఆస్వాదించానని తెలిపాడు. మ్యాచ్ సమయంలో అనికేత్ వర్మ క్యాచ్ వదిలేసిన తరువాత నాకు కాస్త బాధగా అనిపించింది. ఆ సమయంలో కేఎల్ రాహుల్ మాటలు ఉపశమనం కలిగించాయని చెప్పాడు.

Also Read: IPL 2025 : మళ్లీ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్.. రాజస్థాన్ చేతిలో చిత్తు

కేఎల్ రాహుల్ నా సోదరుడిలాంటివాడు. అనికేత్ వర్మ క్యాచ్ ను నేను వదిలేసినప్పుడు అతను నన్ను ఓదార్చాడు. పర్వాలేదు చింతించకు అన్నాడు. క్యాచ్ మిస్ చేశాననే బాధలో ఉన్న నాకు అతని మాటలు ఎంతో ఉపశమనం కలిగించాయి. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా నాకు మద్దతుగా నిలిచాడు. నా సహజ షాట్లు ఆడమని చెప్పాడని అభిషేక్ పోరెల్ పేర్కొన్నాడు.