IPL 2025: ధోని-అశ్విన్ ‘మాస్టర్ ప్లాన్’.. నితీశ్ రాణాను ఎలా ఔట్ చేశారో చూడండి.. వీడియో వైరల్
నితీశ్ రాణా అశ్విన్ వేసిన నాల్గో బంతిని క్రీజు వదలి ముందుకొచ్చి ఆడే ప్రయత్నం చేశాడు. ఇది పసిగట్టిన అశ్విన్.. బంతిని వైడ్ బాల్ వేశాడు.

IPL 2025 (Courtesy BCCI)
MS Dhoni Stumping Nitish Rana: ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఆదివారం రాత్రి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు ఆరు పరుగుల తేడాతో సీఎస్కేని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన సీఎస్కే జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.
Also Read: IPL 2025 : మళ్లీ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్.. రాజస్థాన్ చేతిలో చిత్తు
ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ నితీశ్ కుమార్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అద్భుత బ్యాటింగ్ తో కేవలం 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన అతను.. 36 బంతుల్లో 81 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడుతూ బౌండరీల వర్షం కురిపిస్తున్న సమయంలో.. రాజస్థాన్ ఇన్నింగ్స్ 12ఓవర్లో రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో రెండో బంతిని సిక్స్ కొట్టిన రాణా.. మూడో బంతిని ఫోర్ కొట్టాడు. ఆ తరువాత బంతికి అశ్విన్ తెలివైన బంతితో నితీశ్ రాణాను బిగ్ షాకిచ్చాడు.
నితీశ్ రాణా అశ్విన్ వేసిన నాల్గో బంతిని క్రీజు వదలి ముందుకొచ్చి ఆడే ప్రయత్నం చేశాడు. ఇది పసిగట్టిన అశ్విన్.. బంతిని వైడ్ బాల్ వేశాడు. దీంతో వికెట్ల వెనకాల ఉన్న ధోనీ బంతిని అందుకొని స్టంపౌట్ చేశాడు. నితీశ్ రాణాకు అర్ధమయ్యేలోపే ఔటైపోయాడు. దీంతో ధోనీ- అశ్విన్ ప్లాన్ కు వికెట్ కోల్పోయిన రాణా.. బాధతో పెవిలియన్ కు వెళ్లి పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. అయ్యో రాణా.. కాస్త ఓపిక పట్టాల్సింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు.. ‘‘బౌలింగ్ వేసేది అశ్విన్.. వికెట్ల వెనకాల ధోనీ.. క్రీజు వదిలి ఎలా వెళ్లావ్ రాణా’’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
R. Ashwin got his man Nitish Rana 81(36)
One of the worse match with ball for Ash 4-46-1#IPL2025 #csk #Dhoni pic.twitter.com/NmjPq6AKV3
— Arv (@Arv922137579481) March 30, 2025
నితీశ్ రాణా తన ఐపీఎల్ కెరీర్ లో 110 మ్యాచ్ లలో 2736 పరుగులు చేశాడు. అయితే, ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. సీఎస్కే తో జరిగిన మ్యాచ్ లో అతను తన ఐపీఎల్ కెరీర్ లో 19వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఈ లీగ్ లో ఇప్పటి వరకు నితీశ్ రాణా అత్యధిక స్కోర్ 87 పరుగులు.