IPL 2025: గుజరాత్ బౌలర్‌పై హార్దిక్ పాండ్యా సీరియస్.. అతనివైపు దూసుకెళ్లి వార్నింగ్.. చివర్లో బిగ్ ట్విస్ట్.. వీడియో వైరల్
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టు బౌలర్ పై సీరియస్ అయ్యాడు. అతనివైపు దూసుకెళ్లి..

Hardik Pandya vs Sai Kishore (Courtesy BCCI)
GT vs MI : ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం రాత్రి గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్ జట్టు యువ బౌలర్ పై సీరియస్ అయ్యాడు. అంతేకాదు.. అతనివైపు దూసుకెళ్లి వార్నింగ్ ఇచ్చాడు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: IPL 2025: ముంబై ఓటమి తరువాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక కామెంట్స్.. ఆ కారణంగానే ఓడిపోయారట..
ముంబై బ్యాటింగ్ సమయంలో 15వ ఓవర్ ను గుజరాత్ బౌలర్ సాయి కిశోర్ వేశాడు. క్రీజులో హార్దిక్ పాండ్య ఉన్నాడు. ఈ ఓవర్లో మూడో బంతిని హార్దిక్ బౌండరీ బాదాడు. ఆ మరుసటి బంతిని డిఫెన్స్ చేయగా.. బౌలర్ వైపు కొంత దూరం వెళ్లి ఆగింది. ఈ సమయంలో సాయి కిశోర్ హార్దిక్ వైపు చూశాడు.. ఈ క్రమంలో ఇద్దరూ ఒకొరినొకరు సీరియస్ గా చూసుకున్నారు. హార్దిక్ క్రీజు నుంచి బౌలర్ వైపు దూసుకొచ్చాడు. సాయి కిశోర్ సైతం హార్దిక్ వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు.
ఇద్దరి మధ్య మాటామాటా పెరుగుతున్న క్రమంలో తోటి క్రికెటర్లు వారిని వారించారు. అనంతరం హార్దిక్ చేయి చూపుతూ ‘గో వే’ అన్నట్లుగా సైగ చేశాడు. సాయి బంతిని తీసుకుంటున్నప్పుడు కూడా హార్దిక్ కోపంగా అతనివైపు చూస్తుండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, మ్యాచ్ అనంతరం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
THE HARDIK PANDYA VS SAI KISHORE BATTLE. 🔥pic.twitter.com/u8BrOhbABK
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 29, 2025
మ్యాచ్ అనంతరం ఆటగాళ్లంతా కరచాలనం చేసుకుంటూ వెళ్తున్న సమయంలో హార్ధిక్ పాండ్యా, సాయి కిశోర్ ఎదురు పడ్డారు. హార్దిక్ నవ్వుతూ సాయికిశోర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగిలించుకోవటం గమనార్హం. ఈ సమయంలో ఇద్దరూ నవ్వుతూ కనిపించారు. మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యాతో గొడవ విషయంపై సాయి కిశోర్ మాట్లాడుతూ.. మేమిద్దరం మంచి స్నేహితులం. మైదానంలో అలాగే ఉంటాం. ఆటలో జరిగేవి వ్యక్తిగతంగా తీసుకోమని చెప్పాడు.
Sai Kishore said, “Hardik Pandya is a very good friend of mine. On the field it should be like that, we don’t take things personally. We are good competitors”. pic.twitter.com/evRC2Uml2d
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 29, 2025
ఇదిలాఉంటే.. గుజరాత్ జట్టుకు హార్దిక్ పాండ్య సారథ్యం వహించిన 2022, 2023 సీజన్లలో సాయి కిశోర్ ఆ జట్టులో ఆడాడు.