BCCI Credit
IPL 2025: ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. కీలక మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను 59 పరుగుల తేడాతో చిత్తుచేసింది. బుధవారం వాంఖెడే మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ బ్యాటర్లు తడబడ్డారు. టపటపా వికెట్లు కోల్పోయారు. మిచెల్ శాన్ ట్నర్, జస్ర్పీత్ బుమ్రాలు అద్భుత బౌలింగ్ తో చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ (73 నాటౌట్) అద్భుత బ్యాటింగ్ చేశాడు. వీరు ముగ్గురు ముంబై విజయంలో కీలక భూమిక పోషించారు. దీంతో ముంబై జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకుంది.
మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ బుమ్రా, మిచెల్ శాన్‌ట్నర్ ల గురించి కీలక కామెంట్స్ చేశారు. బుమ్రా, శాంన్‌ట్నర్ జట్టులో ఉండటం ఉపయోగపడిందా అని ప్రశ్నించగా.. ‘‘ఖచ్చితంగా.. ఎందుకంటే వారు నాకు కావాల్సినప్పుడల్లా బౌలింగ్ చేయగలరు. కష్టసమయంలో తమ బౌలింగ్ తో మ్యాచ్ ను నియంత్రణలోకి తేగలరు. అది నా పనిని సులభతరం చేస్తుంది’’ అంటూ హార్ధిక్ పేర్కొన్నారు.
‘‘మొదట్లో 180 పరుగులు చేస్తే బాగుంటుందని మేము అనుకున్నాం. కానీ, మా బ్యాటింగ్ సమయంలో 160 పరుగులైనా చేరుకుంటే చాలా బాగుండేదనిపించింది. కానీ, చివర్లో సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్ ఇన్నింగ్స్ ను ముగించిన విధానం, ముఖ్యంగా నమన్ కీలక దశలో బ్యాటింగ్ కు వచ్చి అద్భుత బ్యాటింగ్ చేశాడు’’ అని హార్దిక్ అన్నారు.
🚨 MUMBAI INDIANS QUALIFIED INTO THE PLAYOFFS FOR 11th TIME 🔥 pic.twitter.com/gN5Eq5shMP
— Johns. (@CricCrazyJohns) May 21, 2025