IPL 2025: సూపర్ ఓవర్ లో రాజస్థాన్ పై ఢిల్లీదే గెలుపు..
మ్యాచ్ టైగా ముగియడంతో చివరికి సూపర్ ఓవర్ కు దారితీసి అందులో ఓటమిపాలైంది.

Courtesy BCCI
IPL 2025: ఈ సీజన్ లో జరిగిన తొలి సూపర్ ఓవర్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 2 వికెట్ల నష్టానికి 11 పరుగులు చేసింది. 12 పరుగుల టార్గెట్ ను ఢిల్లీ 4 బంతుల్లోనే చేజ్ చేసింది. సందీప్ శర్మ బౌలింగ్ లో కేఎల్ రాహుల్ 7 పరుగులు చేయగా, స్టబ్స్ 6 పరుగులు చేశాడు. 4వ బంతికి స్టబ్స్ సిక్స్ బాది ఢిల్లీని గెలిపించాడు. కాగా, ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు చివరలో చతికిలబడింది. మ్యాచ్ టైగా ముగియడంతో చివరికి సూపర్ ఓవర్ కు దారితీసి అందులో ఓటమిపాలైంది.
ఢిల్లీ, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. ఈ సీజన్ లో ఇదే తొలి సూపర్ ఓవర్. 2021 ఐపీఎల్ తర్వాత 2025 ఐపీఎల్ లో సూపర్ ఓవర్ జరిగింది. సూపర్ ఓవర్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 11 పరుగులు చేసింది. రియాన్ పరాగ్, జైస్వాల్ రనౌట్ అయ్యారు. 20వ ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ ను టై చేసిన స్టార్క్… సూపర్ ఓవర్ లో బౌలింగ్ చేశాడు. హెట్ మెయర్ 5 రన్స్, పరాగ్ 4 పరుగులు చేశారు. ఎక్స్ ట్రాల ద్వారా 2 పరుగులు వచ్చాయి.
Also Read : ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం? ఆ హైదరాబాదీతో జాగ్రత్త.. ఐపీఎల్ జట్లకు బీసీసీఐ హెచ్చరిక..!
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రాజస్థాన్ కూడా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులే చేసింది. దాంతో సూపర్ ఓవర్ కు దారితీసింది. రాజస్థాన్ చివరి ఓవర్ లో 9 పరుగులు చేయాల్సి ఉండగా.. స్టార్క్ సూపర్బ్ గా బౌలింగ్ చేసి 8 పరుగులే ఇచ్చాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. రాజస్థాన్ జట్టులో యశస్వి జైస్వాల్, నితీశ్ రానా హాఫ్ సెంచరీలతో రాణించారు. జైస్వాల్ 37 బంతుల్లో 51 పరుగులు, నితీశ్ రానా 28 బంతుల్లో 51 రన్స్ చేశాడు. అటు శాంసన్ కూడా మెరిశాడు. టాప్ ఆర్డర్ రాణించినా.. రాజస్థాన్ గెలవలేకపోయింది.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here