IPL 2025 Final: ఫైనల్లో ఓటమి తరువాత శ్రేయాస్ అయ్యర్ కీలక కామెంట్స్.. అతని వల్లే ఓడాం..

మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ ఓటమిపై కీలక కామెంట్స్ చేశాడు.

IPL 2025 Final: ఎట్టకేలకు ఆర్సీబీ 18 ఏళ్ల కల నెరవేరింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులే చేసింది. ఫలితంగా ఆరు పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది.

Also Read: Rohit Sharma : మీరేంట్రా ఇలా ఉన్నారు.. రోహిత్ శ‌ర్మ‌ను దోచుకున్న ముంబై ప్లేయ‌ర్లు..!

మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ ఓటమిపై కీలక కామెంట్స్ చేశాడు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసింది. ఫైనల్లో ఓడినా మా కుర్రాళ్లు సందర్భానికి తగినట్లుగా ఆడారు. ఈ మ్యాచ్ లో ఓడాల్సింది కాదేమో. గత మ్యాచ్ లో 200 పరుగుల లక్ష్యం సులువుగా చేధించాం. కానీ, ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా అసాధారణ ప్రదర్శనతో మ్యాచ్ ను ములుపు తిప్పాడు. అతని అనుభవాన్ని ఉపయోగించి బౌలింగ్ చేశాడు. మా జట్టులో చాలా మంది కుర్రాళ్లు తొలి సీజన్ ఆడారు. అయినా వారు ఫియర్ లెస్ గేమ్ ఆడారు. వచ్చే ఏడాది టైటిల్ గెలిచే ప్రయత్నం చేస్తాం.’’ అని శ్రేయాస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

 

Also Read: Gukesh vs Magnus Carlsen : గుకేశ్ చేతిలో ఓట‌మి.. తీవ్ర అస‌హ‌నానికి గురైన కార్ల్‌స‌న్.. ఏం చేశాడో చూశారా?

శ్రేయస్ అయ్యర్ ఫైనల్ మ్యాచ్ లో పరుగులు రాబట్టడంలో విఫలం అయ్యాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. చివరలో శశాంక్ (30 బంతుల్లో 61నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగినా.. ఫలితం లేకపోయింది. పంజాబ్ కి ఓటమి తప్పలేదు. జోష్ ఇంగ్లిస్ 23 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 22 బంతుల్లో 26 పరుగులు చేశాడు. మరోవైపు ఆర్సీబీ బౌలర్లు కృనాల్ పాండ్యా 4ఓవర్లు వేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు, యష్ దయాళ్, జోష్ హాజెల్ వుడ్, రోమారియో షెఫర్డ్ తలాఒక వికెట్ పడగొట్టారు.