Gukesh vs Magnus Carlsen : గుకేశ్ చేతిలో ఓటమి.. తీవ్ర అసహనానికి గురైన కార్ల్‌సన్.. ఏం చేశాడో చూశారా?
నార్వేకు చెందిన ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ పై భారత యువ గ్రాండ్ మాస్టర్, ప్రపంచ ఛాంపియన్ గుకేశ్ ప్రతీకారం తీర్చుకున్నాడు.

Norway Chess 2025 tournament Magnus Carlsen Reaction Viral After Losing To Gukesh
నార్వేకు చెందిన ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ పై భారత యువ గ్రాండ్ మాస్టర్, ప్రపంచ ఛాంపియన్ గుకేశ్ ప్రతీకారం తీర్చుకున్నాడు. నార్వే చెస్ 2025 టోర్నమెంట్ ఆరో రౌండ్‌లో కార్ల్‌సన్‌పై గుకేశ్ విజయం సాధించాడు. నాలుగు గంటల పాటు ఈ గేమ్ సాగింది.
ఆది నుంచి కార్ల్‌సన్ ఆధిక్యంలో ఉన్నాడు. అయితే.. 52వ ఎత్తులో కార్ల్‌సన్ ఓ పెద్ద తప్పిదం చేశాడు. దీన్ని గుకేశ్ తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. మొత్తంగా 62 ఎత్తుల్లో కార్ల్‌సన్ ఆటకట్టించి విజయాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో ఈ టోర్నీలో తొలి రౌండ్‌లో ఎదురైన ఓటమికి గుకేశ్ ప్రతీకారం తీర్చుకున్నటైంది.
Rohit Sharma : మీరేంట్రా ఇలా ఉన్నారు.. రోహిత్ శర్మను దోచుకున్న ముంబై ప్లేయర్లు..!
GUKESH BEATS MAGNUS CARLSEN. 🇮🇳
– The frustration from Magnus after the defeat. 😲pic.twitter.com/SisoNJNDoe
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 1, 2025
తాను ఓడిపోవడంతో కార్ల్‌సన్ తీవ్ర అసహనానికి గురైయ్యాడు. బోర్డు పై తన పిడికిలితో బలంగా గుద్దాడు. ఆ వెంటనే తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. గుకేశ్ కు సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మరోవైపు కార్ల్‌సన్ పై విజయం సాధించడంతో గుకేశ్ కాసేపు షాక్‌లో ఉండిపోయాడు. తేరుకున్న అనంతరం తన విజయాన్ని ఆస్వాదించాడు. ఆరో రౌండ్ తర్వాత గుకేశ్ 8.5 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
RCB vs PBKS : ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీకి బిగ్ షాక్..! ఇప్పుడెలా..
THE REACTION FROM GUKESH AFTER BEATING MAGNUS CARLSEN. 🥹❤️pic.twitter.com/Pnp4uABqfE
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 1, 2025
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.