Rohit Sharma : మీరేంట్రా ఇలా ఉన్నారు.. రోహిత్ శ‌ర్మ‌ను దోచుకున్న ముంబై ప్లేయ‌ర్లు..!

ఆరోసారి ఐపీఎల్ టైటిల్ ను ముద్దాడాల‌న్న ముంబై ఇండియ‌న్స్ ఆశ నెర‌వేర‌లేదు

Rohit Sharma : మీరేంట్రా ఇలా ఉన్నారు.. రోహిత్ శ‌ర్మ‌ను దోచుకున్న ముంబై ప్లేయ‌ర్లు..!

PIC Credit@MI

Updated On : June 3, 2025 / 11:53 AM IST

ఆరోసారి ఐపీఎల్ టైటిల్ ను ముద్దాడాల‌న్న ముంబై ఇండియ‌న్స్ ఆశ నెర‌వేర‌లేదు. ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ముంబై తృటిలో ఫైన‌ల్ చేరుకునే అవ‌కాశాన్ని కోల్పోయింది. క్వాలిఫ‌య‌ర్‌-2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ఈ క్ర‌మంలో ఐపీఎల్ 2025 సీజ‌న్ నుంచి నిష్ర్క‌మించింది. హార్దిక్ పాండ్యా నాయ‌క‌త్వంలోని ముంబై జ‌ట్టు లీగ్ ద‌శ‌లో నాలుగో స్థానంలో నిలిచింది.

పంజాబ్‌తో మ్యాచ్ ముగిసిన త‌రువాత ఆట‌గాళ్లు అంద‌రూ ఎవ‌రి ఇళ్ల‌కు వారు వెళ్లిపోయారు. అయితే.. యువ ఆట‌గాళ్లు జ‌ట్టును వీడే ముందు త‌మ‌ కిష్ట‌మైన సీనియ‌ర్ ప్లేయ‌ర్ల వ‌ద్ద ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు తీసుకున్నారు. ఇంకొంద‌రు కిట్ల‌ను అందుకున్నారు.

RCB vs PBKS : AI జాతకం.. Grok, Gemini, ChatGPT అన్నిటిదీ ఒకటే మాట.. IPL 2025 కొట్టే జట్టు ఇదే..

ముంబై ఇండియ‌న్స్ స్టార్ ప్లేయ‌ర్ రోహిత్ శ‌ర్మ వ‌ద్ద‌కు వ‌చ్చిన ముంబైలోని కొంద‌రు ఆట‌గాళ్లు అత‌డి ఆటోగ్రాఫ్ ల‌ను జెర్సీల‌పై అడిగి తీసుకున్నారు. ఇంకొంద‌రు అత‌డి వ‌ద్ద ఉన్న బ్యాట్ల‌ను కావాల‌ని కోరారు. అడిగిన వారందరికి హిట్‌మ్యాన్ త‌న వ‌ద్ద ఉన్న బ్యాట్ల‌ను ఇచ్చేశాడు. ఇలా మొత్తంగా ఆరు బ్యాట్ల‌ను పంచి పెట్టాడు. దీంతో అత‌డి వ‌ద్ద ఉన్నకిట్ బ్యాగ్ ఖాలీ అయింది.

RCB vs PBKS : ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీకి బిగ్ షాక్‌..! ఇప్పుడెలా..

ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఆరు బ్యాట్లు తీసుకున్నారు. నా వ‌ద్ద ఒక్క బ్యాట్ కూడా లేదు.’ అంటూ ఆ వీడియోలో రోహిత్ శ‌ర్మ అన‌డం వినొచ్చు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. నీది మంచి మ‌న‌సు అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.