RCB vs PBKS : AI జాతకం.. Grok, Gemini, ChatGPT అన్నిటిదీ ఒకటే మాట.. IPL 2025 కొట్టే జట్టు ఇదే..
గ్రోక్, జెమిని, చాట్‌జీపీటీలు మూడు కూడా ఒకే విజతను ఎంచుకున్నాయి.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. మంగళవారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ రెండింటిలో ఏ జట్టు విజయం సాధించినా కూడా కొత్త ఛాంపియన్ అవతరించినట్లే. ఎందుకంటే ఇంత వరకు అటు పంజాబ్ గానీ, ఇటు ఆర్‌సీబీ గానీ ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడలేదు.
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు పంజాబ్, ఆర్‌సీబీ జట్లు 36 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో చెరో 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొంత మంది ఆర్‌సీబీ అని, ఇంకొందరు పంజాబ్ అని ఎవరికి వారు చెబుతున్నారు. ఇక ఇదే విషయాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని అడుగగా.. ఆసక్తికర సమాధానం వచ్చింది. గ్రోక్, జెమిని, చాట్‌జీపీటీలు మూడు కూడా ఒకే విజతను ఎంచుకున్నాయి.
RCB vs PBKS : ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీకి బిగ్ షాక్..! ఇప్పుడెలా..
గ్రోక్ అంచనా..
ఆర్‌సీబీ విజయం సాధిస్తుందని గ్రోక్ అంచనా వేసింది. క్వాలిఫయర్-1లో పంజాబ్ పై విజయం సాధించడం, ఆ మ్యాచ్‌లో 101 పరుగులకే పంజాబ్‌ను ఆలౌట్ చేసి, చాలా బంతులు మిగిలి ఉండగానే ఆర్‌సీబీ విజయం సాధించడం ఓ కారణం. 11 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసిన జోష్ హాజిల్‌వుడ్, సుయాష్ శర్మ నేతృత్వంలోని ఆర్‌సీబీ బౌలింగ్ దాడి చాలా బలంగా ఉంది. అటు బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ (55.81 సగటుతో 614 పరుగులు చేయడం)లతో పాటు ఫిల్ సాల్ట్ భీకరఫామ్ లో ఉండడంతో.. ఆర్‌సీబీ బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా ఆర్‌సీబీ ఫామ్, జట్టు సమతుల్యం, అనుభవం వంటివి గెలిచేందుకు దోహదపడుతాయని గ్రోక్ భావిస్తున్నాడు.
జెమినీ..
రెండు జట్లు కూడా తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని కోరుకోవడంతో ఫైనల్ మ్యాచ్ చాలా ఆసక్తిగా ఉంటుందని జెమినీ చెబుతోంది. ఈ సీజన్‌లో ఇటీవలి విజయాలు, వారి బలమైన క్వాలిఫయర్ ప్రదర్శన కారణంగా ఆర్‌సిబికి స్వల్ప ఆధిక్యం ఉండవచ్చు, పంజాబ్ కింగ్స్ స్థితిస్థాపకతను ప్రదర్శించింది. వారి శక్తివంతమైన బ్యాటింగ్‌తో ఏ జట్టునైనా సవాలు చేయగలదు.
మ్యాచ్ ఫలితం ఆ రోజు టాస్, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని జెమిని భావిస్తోంది. విజేతను ఎంచుకోవడం కఠినమైన నిర్ణయం, కానీ ఖచ్చితంగా ఎంచుకోమని కోరితే మాత్రం జెమిని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైపు కొంచెం మొగ్గు చూపుతుంది.
చాట్‌జీపీటీ..
ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌పై స్థిరమైన ఫామ్, క్వాలిఫైయర్ 1లో సులభమైన విజయంతో సహా వారి విజయాలను దృష్టిలో ఉంచుకుని RCB ఫేవరెట్ అని ChatGPT చెబుతోంది. కానీ శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ గట్టి సవాల్ విసిరే అవకాశం ఉందని చాట్ జీపీటీ హెచ్చరిస్తోంది. ఈ సీజన్‌లో వారి ప్రస్తుత ఫామ్, హెడ్-టు-హెడ్ ప్రయోజనం కారణంగా ఆర్‌సీబీ వైపు ChatGPT స్వల్ప మొగ్గు చూపిస్తోంది.