Womens ODI World cup 2025 : మహిళల వన్డే ప్రపంచకప్ 2025 షెడ్యూల్ వచ్చేసింది.. విశాఖ వేదికగా పలు మ్యాచ్‌లు ..
భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్న మహిళల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది.

ICC Womens ODI World cup 2025 venues list out
భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్న మహిళల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మ్యాచ్‌లకు సంబంధించిన తేదీలు, వేదికలను సోమవారం వెల్లడించింది. సెప్టెంబర్ 30 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. నవంబర్ 2 వరకు జరగనుంది.
పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లు అన్ని శ్రీలంకలోని ప్రేమ దాస స్టేడియం వేదికగా జరగనున్నాయి. ఇక భారత దేశంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం, గౌహతిలోని ఏసీఏ స్టేడియం, ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం, విశాపట్నంలోని ఏసీఏ-వీడిసీఏ స్టేడియంలో మ్యాచ్‌లు జరగుతాయి.
RCB : ఆర్‌సీబీకి అన్నీ శుభశకునాలే.. ఈ ఒక్కటి వర్కౌట్ అయితే.. కోహ్లీ చేతిలో కప్పు..
ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్ సెప్టెంబర్ 30న బెంగళూరు వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆడనుంది. అయితే.. టీమ్ఇండియాతో పోటీపడే ప్రత్యర్థి క్వాలిఫయర్ పోటీల ద్వారా నిర్ణయించబడుతుంది. మొదటి సెమీఫైనల్ అక్టోబర్ 29న గౌహతిలో జరగనుంది. ఒకవేళ పాక్ గనుక సెమీస్‌కు క్వాలిఫై అయితే మాత్రం కొలొంబో వేదికగానే ఈ మ్యాచ్ జరగనుంది. ఇక అక్టోబర్ 30న జరగనున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ కు బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనుంది.
2025 ICC Women’s Cricket World Cup schedule 𝐑𝐄𝐕𝐄𝐀𝐋𝐄𝐃!
Read more ➡ https://t.co/myj2Gfamkv pic.twitter.com/zl3IYWC2e6
— ICC (@ICC) June 2, 2025
నవంబర్ 2న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. పాక్ ఫైనల్‌కు వస్తే కొలొంబో వేదికగా, రాకుంటే మాత్రం బెంగళూరు వేదికగానే జరగనుంది. కాగా.. మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత్ 12 ఏళ్ల తరువాత ఆతిథ్యం ఇస్తుండడం గమనార్హం.
Preity Zinta : కన్నుగీటిన ప్రీతి జింటా.. ఆ యువఆటగాడిని చూసేనా?
ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లు కప్పు కోసం పోటీపడనున్నాయి. ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో అడుగుపెడుతుంది.