Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో కీలక మైన ప్లేఆఫ్స్‌కు ముందు ఆర్‌సీబీకీ శుభవార్త ఇది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ భారత్‌కు చేరుకున్నాడు. గాయం కారణంతో గత కొన్ని మ్యాచ్‌లకు దూరం అయిన ఈ స్టార్ పేసర్ ఆదివారం ఉదయం లక్నోకు చేరుకున్నాడు. దీంతో ఆర్‌సీబీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ పాక్షికంగా వాయిదా పడిన సమయంలో హాజిల్‌వుడ్ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని వార్తలు వచ్చాయి. గాయంతో పాటు జూన్ 11 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఉండడంతో అతడు అందుబాటులోకి రావడం అసాధ్యమే అని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అతడు తిరిగి ఆర్‌సీబీ జట్టులో చేరాడు.
He’s here
ಬಂದ್ಬಿಟ್ಟ
వచ్చేసాడు
வந்துட்டான்
वो आगया
വന്നിരിക്കുന്നുWelcome back, Josh Reginald Hazlewood! 🫡❤🔥 pic.twitter.com/pttA5DX3N8
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 25, 2025
జోష్ హేజిల్‌వుడ్ తిరిగి జట్టులో చేరడాన్ని ఆర్‌సీబీ ధ్రువీకరించింది.
ఇదిలా ఉంటే.. ఆర్‌సీబీ లీగ్ దశలో తన చివరి మ్యాచ్‌ను మే 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో టాప్ -2లో నిలవాలంటే లక్నో పై విజయం సాధించాల్సి ఉంది.
ఈ మ్యాచ్‌కు స్టార్ పేసర్ హేజిల్‌వుడ్ అందుబాటులోకి రావడంతో ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది అనడంలో సందేహం లేదు. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన హేజిల్‌వుడ్ 18 వికెట్లు తీసి ఆర్‌సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.