PBKS : ఢిల్లీ చేతిలో ఓడిపోయినా ‘నో ప్రాబ్లమ్’.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి పంజాబ్..! ఎలా అంటే..?
గుజరాత్‌కు లక్నో, ఆర్‌సీబీకి సన్‌రైజర్స్ లు షాక్ ఇవ్వగా తాజాగా పంజాబ్‌కు ఢిల్లీ గట్టి షాక్ ఇచ్చింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. అయితే.. ప్రస్తుతం ఈ నాలుగు జట్లు లీగ్ దశ ముగిసే సరికి టాప్-2 స్థానంలో నిలిచేందుకు తీవ్రంగా పోటీపడుతున్నాయి. అదే సమయంలో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించిన జట్లు ప్రస్తుతం ఈ నాలుగు జట్లకు భారీ షాక్‌లు ఇస్తున్నాయి.
గుజరాత్‌కు లక్నో, ఆర్‌సీబీకి సన్‌రైజర్స్ లు షాక్ ఇవ్వగా తాజాగా పంజాబ్‌కు ఢిల్లీ గట్టి షాక్ ఇచ్చింది. ఢిల్లీ చేతిలో ఓడిపోవడంతో పంజాబ్ టాప్-2 అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఢిల్లీ చేతిలో ఓడిపోయినా పాయింట్ల పట్టికలో పంజాబ్ ప్రస్తుతం 17 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
టాప్ -2లోనే ఉండాలంటే..?
అయితే.. పంజాబ్ జట్టు మే 26న లీగ్ దశలో చివరి మ్యాచ్ ఆడనుంది. అది కూడా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. అప్పుడు పంజాబ్ ఖాతాలో 19 పాయింట్లు వచ్చి చేరుతాయి. కానీ టాప్-2లో నిలుస్తుందన్న గ్యారెంటీ లేదు.
గుజరాత్ టైటాన్స్ తన చివరి మ్యాచ్‌లో చెన్నైతో, ఆర్‌సీబీ తన చివరి మ్యాచ్‌లో లక్నోతో తలపడనున్నాయి. ముంబై పై పంజాబ్ విజయం సాధించి అదే సమయంలో గుజరాత్ లేదా ఆర్‌సీబీ రెండింటిలో కనీసం ఒక్క జట్టు అయినా చివరి మ్యాచ్‌ల్లో ఓడిపోతే అప్పడు టాప్-2లో పంజాబ్ ఉంటుంది. ఒకవేళ ఆర్‌సీబీ, గుజరాత్ రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడిపోతే అప్పుడు పంజాబ్ అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇలా జరగాలంటే ముంబై పై పంజాబ్ విజయం సాధించడం ఎంతో ముఖ్యం.