PBKS vs DC : ఢిల్లీ చేతిలో ఓటమి.. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్.. అందువల్లే ఓడిపోయాం.. లేదంటేనా..
ఐపీఎల్ 2025 సీజన్ నుంచి వెళ్తూ వెళ్తూ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పంజాబ్ కింగ్స్‌ను గట్టి దెబ్బ కొట్టింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్ నుంచి వెళ్తూ వెళ్తూ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పంజాబ్ కింగ్స్‌ను గట్టి దెబ్బ కొట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ ఓటమితో లీగ్ దశ ముగిసే సరికి పాయింట్ల పట్టికలో టాప్-2 ప్లేస్‌లో నిలిచే పంజాబ్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (53; 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్కస్ స్టాయినిస్ (44 నాటౌట్; 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ మూడు వికెట్లు తీశాడు. విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.
Also Read : IPL 2025: పంజాబ్‌కు బిగ్ షాకిచ్చిన ఢిల్లీ.. అనూహ్యంగా టాప్-2 రేసులోకి ముంబై..! ఎలా అంటే?
అనంతరం 207 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఢిల్లీ బ్యాటర్లలో సమీర్ రిజ్వీ (58 నాటౌట్; 25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు), కరుణ్ నాయర్ (44; 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (35; 21 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ రెండు వికెట్లు తీశాడు. మార్కో జాన్సెన్, ప్రవీణ్ దుబే లు చెరో వికెట్ పడగొట్టారు.
ఇక ఈ మ్యాచ్‌లో బౌలింగ్ వైఫల్యమే తమ ఓటమికి కారణమని పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం అయ్యర్ మాట్లాడుతూ.. ఈ పిచ్ పై 207 పరుగులు అనేది అద్భుతమైన స్కోరు అని చెప్పాడు. ఈ వికెట్ పై వేరియబుల్ బౌన్స్ ఉందన్నాడు. అంతేకాకుండా బంతి వేగంలో వ్యత్యాసం ఉందన్నాడు. ఇక తమ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేయలేదన్నాడు. పిచ్‌కు తగ్గట్లు స్టంప్స్ లైన్‌లో హార్డ్ లెంగ్త్‌తో బంతిని హిట్ చేయాలనుకున్నట్లు చెప్పాడు. అయితే.. వికెట్లు తీయాలనే తొందరలో బౌలర్లు బౌన్సర్లు ఎక్కువగా వేశారన్నాడు.
Also Read : RCB : ఆర్‌సీబీకి లక్నో ‘టెన్షన్’.. కోహ్లీ ఆశ నెరవేరేనా?
‘ఇలాంటి పెద్ద టోర్నీల్లో ప్రతి జట్టు బలంగానే ఉంటుంది. మనం సానుకూలంగా, ప్రశాంతంగా ఉండడం ఎంతో ముఖ్యం. ఇక తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెడుతాం. పటిష్టమైన ప్రణాళికలతో మ్యాచ్ బరిలోకి దిగుతాం. నాకు ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు లేవు. వేలికి మాత్రం చిన్నగాయమైంది. తదుపరి మ్యాచ్ వరకు నయం అవుతుంది.’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పాడు.