IPL 2025 : కీలక మ్యాచ్.. ప్లేఆఫ్స్ రేసు నుంచి చెన్నై ఔట్.. హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవం!
IPL 2025 : చెన్నైతో జరిగిన కీలక మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. వరుస మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన ధోనిసేన దాదాపు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించినట్టే..

IPL 2025 Photo Credit : IPL (X)
IPL 2025 : ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ ఓటమితో చెన్నై ప్లేఆఫ్ ఆశలు గల్లంతు అయ్యాయి. చెన్నై ఇప్పుడు 5 మ్యాచ్‌లను గెలవాలి. ఇతర జట్లపై కూడా కూడా ఆధారపడాలి. పాయింట్ల పట్టికలో కూడా చెన్నై అట్టడుగున ఉంది.
Read Also : Apple iPhone Plan : ఆపిల్ బిగ్ ప్లాన్.. 2026 నాటికి అమెరికాలో విక్రయించే ఐఫోన్ల అసెంబ్లీ మొత్తం భారత్‌కు..!
హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో 3 గెలిచి 6 పాయింట్లతో 8వ స్థానానికి చేరుకుంది. చిదంబరం స్టేడియం (చెపాక్)లో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. హైదరబాద్ బౌలర్ల దెబ్బకు చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌట్ అయింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హైదరాబాద్ జట్టులో ఇషాన్ కిషన్ (44: 34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), కమిండు మెండిస్ (32* 22 బంతుల్లో 3 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (19, 13 బంతుల్లో 2 ఫోర్లు) అద్భుతంగా రాణించారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసుకున్నారు.
అంతకుముందు, డెవాల్డ్ బ్రెవిస్ 42 పరుగులతో చెన్నై తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. SRH తరఫున హర్షల్ పటేల్ 4 వికెట్లు పడగొట్టాడు. చెన్నైపై హైదరాబాద్ గెలవడం ఇదే మొదటిసారి. చెన్నైపై గెలుపుతో హైదరాబాద్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. హైదరాబాద్ మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే SRH మిగతా అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించాలి. చెన్నై ఆడిన 9 మ్యాచ్‌ల్లో 7 ఓడి కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. ధోనిసేన మిగిలిన 5 మ్యాచ్‌లలో గెలిచినప్పటికీ, ఇప్పటికీ మొదటి 4 స్థానాల్లో చోటు దక్కించుకోకపోవచ్చు.
చెన్నైకి సొంత మైదానంలో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓడిపోయింది. మిగతా అన్ని మ్యాచ్‌ల్లో గెలిచినా చెన్నైకి ప్లే ఆఫ్స్ అవకాశాలు కష్టమే.. టోర్నీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ దాదాపు నిష్క్రమించినట్లే..