IPL 2025 LSG vs RCB : Photo Credit : (IPL20.com/ ©BCCI
IPL 2025 : ఐపీఎల్ టోర్నీలో ఆర్సీబీ అదరగొట్టింది. క్వాలిఫయర్-1కు బెంగళూరు దూసుకెళ్లింది. లక్నో సూపర్ జెయింట్స్‌పై (IPL 2025) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Read Also : Motorola Razr 60 : మోటోరోలా మడతబెట్టే ఫోన్ కావాలా? ఈ వారమే లాంచ్.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చంటే?
228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగింది. 18.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 230 స్కోరుతో గెలిచింది. కెప్టెన్ జితేశ్ శర్మ (85 నాటౌట్) అద్భత ప్రదర్శన చేయగా, మయాంక్ అగర్వాల్ (41) పరుగులతో రాణించాడు.
ఇతర ఆటగాళ్లలో ఫిల్ సాల్ట్ (30)కే వెనుదిరగగా, విరాట్ కోహ్లి (54) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. రజత్ పాటిదార్ (14) పరుగులకే పరిమితమయ్యాడు. లివింగ్ స్టోన్ ఖాతా కూడా తెరవలేదు. లక్నో బౌలర్లలో ఒరూర్కే 2 వికెట్లు పడగొట్టగా, ఆకాష్ సింగ్, అవేశ్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు.
క్వాలిఫయర్ 1లో బెంగళూరు :
లక్నోపై గెలుపుతో ఆర్సీబీ జట్టు క్వాలిఫయర్ 1లో ఆడే అవకాశం దక్కించుకుంది. ఇప్పటికే ప్లేఆఫ్ నుంచి లక్నో వైదొలగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌తో లీగ్ దశ ముగిసింది.
ఈ నెల 29న క్వాలిఫయర్-1లో పంజాబ్ జట్టుతో ఆర్సీబీ తలపడనుంది. ఈ క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టు ఫైనల్‌కు వెళ్లనుంది. ఓడిన జట్టు క్వాలిఫయర్-2లో మరో జట్టుతో తలపడనుంది. పాయింట్ల పట్టికలో బెంగళూరు జట్టు 19 పాయింట్లతో టాప్ 2లోకి దూసుకెళ్లింది.
(IPL 2025) రిషబ్ పంత్ సెంచరీ :
ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు అద్భుతమైన ప్రదర్శనతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 భారీ స్కోర్ చేసింది. ప్రత్యర్థి జట్టు బెంగళూరుకు 228 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
Read Also : WhatsApp iPad : పండగ చేస్కోండి.. ఐప్యాడ్ యూజర్ల కోసం వాట్సాప్ వచ్చేసిందోచ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!
లక్నో ఆటగాళ్లలో మిచెల్ మార్ష్ (67) హాఫ్ సెంచరీ, రిషబ్ పంత్ (118 నాటౌట్) సెంచరీతో అజేయంగా నిలవగా, నికోలస్ పూరన్ (13), మాథ్యూ (12), అబ్దుల్ సమద్ (1 నాటౌట్) పరుగులతో రాణించారు. బెంగళూరు బౌలర్లలో నువాన్ తుషార, భువనేశ్వర్ కుమార్, రొమారియా షెపర్డ్ తలో వికెట్ తీసుకున్నారు.