Motorola Razr 60 : మోటోరోలా మడతబెట్టే ఫోన్ కావాలా? ఈ వారమే లాంచ్.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చంటే?
Motorola Razr 60 : వచ్చే వారం మోటోరోలా కొత్త ఫోల్డబుల్ ఫోన్ రాబోతుంది. లాంచ్ కు ముందే ఈ మడతబెట్టే ఫోన్ ఫీచర్లు, ధర వివరాలివే..

Motorola Razr 60
Motorola Razr 60 : మోటోరోలా అభిమానులకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి మోటోరోలా నుంచి సరికొత్త (Motorola Razr 60) ఫోల్డబుల్ ఫోన్ రెజర్ 60 వచ్చేస్తోంది.
ఇప్పటికే మోటోరోలా 60 అల్ట్రా లాంచ్ కాగా.. కంపెనీ ఇప్పుడు రెజర్ 60 ఫోన్ అతి త్వరలో లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ మడతబెట్టే ఫోన్ మే 28న మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో లాంచ్ కానుంది.
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. అలాగే, మోటోరోలా మైక్రోసైట్ ఇప్పటికే ఈ రెజర్ 60 ఫోన్ వివరాలను లిస్ట్ చేసింది.
ఏఐ ఫీచర్లు, డిస్‌ప్లేతో సహా కొన్ని కీలక స్పెషిఫికేషన్లను ధృవీకరించింది. రాబోయే ఈ మోటోరోలా ఫ్లిప్-స్టైల్ ఫోన్ కలర్ ఆప్షన్లు, స్టోరేజీ వేరియంట్‌లను కూడా కంపెనీ రివీల్ చేసింది.
మోటోరోలా రెజర్ 60 లాంచ్ తేదీ :
మే 28న భారత మార్కెట్లో మోటోరోలా రెజర్ 60 ఫోన్ లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ పాంటోన్ జిబ్రాల్టర్ సీ, స్ప్రింగ్ బడ్, లైటెస్ట్ స్కై అనే 3 కలర్ ఆప్షన్లలో లాంచ్ కానుంది. ఈ మోటోరోలా ఫోన్ 8GB ర్యామ్, 256GB సింగిల్ స్టోరేజ్ వేరియంట్ కలిగి ఉంటుంది.
మోటోరోలా రెజర్ 60 స్పెసిఫికేషన్లు (అంచనా) :
మోటోరోలా రెజర్ 60 ఫోల్డబుల్ ఫోన్ 6.96-అంగుళాల pOLED (LTPO) ప్యానెల్‌తో వస్తుంది. 3.63-అంగుళాల కవర్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉండవచ్చు.
హుడ్ కింద ఈ మోటోరోలా ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7400X ద్వారా పవర్ పొందవచ్చు. 8GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 15తో వస్తుంది.
కంపెనీ 3OS అప్‌డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించవచ్చు. ఈ మోటోరోలా ఫోన్ 30W ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 4,500mAh సపోర్టుతో రావచ్చు.
కెమెరా విషయానికొస్తే.. ఈ మోటోరోలా రెజర్ 60 ఫోన్ 50MP ప్రైమరీ షూటర్, 13MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ మోటోరోలా ఫోన్ 32MP సెల్ఫీ కెమెరాను అందిస్తుంది. టైటానియం హింజ్, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP48 సర్టిఫికేషన్‌ను అందిస్తుంది.
మోటోరోలా రేజర్ 60 ధర (అంచనా) :
మోటోరోలా రేజర్ 60 ధర దాదాపు రూ. 60వేల వరకు ఉండవచ్చు. అయితే, కంపెనీ ఇంకా ధర వివరాలను ప్రకటించలేదు.