UPI Limit : యూపీఐ యూజర్లకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్.. ఇకపై పేమెంట్లపై లిమిట్స్.. ఫుల్ డిటెయిల్స్..!
UPI Limit : యూపీఐ పేమెంట్లకు సంబంధించి NPCI కొత్త రూల్స్ తీసుకురానుంది ఈ కొత్త నిబంధనలు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వస్తాయి.

UPI Limit
UPI Limit : యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. యూపీఐ కొత్త రూల్స్ రాబోతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆగస్టు 1, 2025 నుంచి యూపీఐలో కొత్త API రూల్స్ అమలు చేయనుంది.
ఈ కొత్త నిబంధనలతో యూపీఐ సర్వీసులను పరిమితం కానున్నాయి. పేటీఎం, ఫోన్‌పే వంటి బ్యాంకులు, పేమెంట్ సర్వీసుదారులకు ఎన్‌పీసీఐ కొత్త సర్వీసులకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది.
బ్యాలెన్స్ చెక్, ఆటోపే, పేమెంట్ స్టేటస్ చెకింగ్ వంటి సర్వీసులపై ప్రభావం పడుతుంది. ఆగస్టు 1 తర్వాత యూపీఐ సర్వీసుల్లో రాబోయే మార్పులకు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి తెలుసుకుందాం.
బ్యాలెన్స్ చెకింగ్ :
వినియోగదారులు ఇప్పుడు ఏదైనా UPI యాప్ నుంచి రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయగలరు. మీరు రెండు యాప్‌లను ఉపయోగిస్తే.. రెండింటిలోనూ విడివిడిగా 50 సార్లు చెక్ చేయవచ్చు. అంతకంటే ఎక్కువసార్లు బ్యాలెన్స్ సమాచారాన్ని పొందలేరు.
ఆటోపే పేమెంట్ టైమ్ లిమిట్ :
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9:30 వరకు రద్దీ సమయాల్లో ఆటోపే చేయలేరు. ఈ పేమెంట్స్ రద్దీ లేని సమయాల్లో మాత్రమే ప్రాసెస్ అవుతాయి. ఆటోపే షెడ్యూల్‌లో ఆలస్యం జరగవచ్చు.
లావాదేవీ స్టేటస్ చెకింగ్ :
నెట్‌వర్క్ సమస్యలు వంటి కొన్ని ఎర్రర్ కోడ్‌ల కారణంగా పేమెంట్ ఫెయిల్ అయితే.. స్టేటస్ చెక్ చేయడానికి పదేపదే API కాల్స్ ఆగిపోతాయి. పేమెంట్ సక్సెస్ అయిందో లేదో యూజర్లకు వెంటనే తెలియదు.
అకౌంట్ వివరాల జాబితా :
వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌కు లింక్ చేసిన అకౌంట్ల జాబితాను ఒక యాప్ నుంచి రోజుకు 25 సార్లు మాత్రమే చెక్ చేయగలరు. వినియోగదారులు తమ బ్యాంకును ఎంచుకున్నప్పుడు మాత్రమే ఈ రిక్వెస్ట్ వర్క్ అవుతుంది.
NPCI బ్యాంకులు, PSP, API వినియోగాన్ని మానిటరింగ్ చేయాలని ఆదేశించింది. రూల్స్ అతిక్రమిస్తే.. ఏపీఐ లిమిట్స్, పెనాల్టీలు లేదా కొత్త కస్టమర్ల చేర్చడంపై నిషేధం విధించవచ్చు. అన్ని PSP సిస్టమ్స్ 31 ఆగస్టు 2025 నాటికి సిస్టమ్ ఆడిట్ అండర్‌టేకింగ్ ఇవ్వాలి.