Oppo Reno 14 : ఒప్పో రెనో 14 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌ ఎప్పుడో తెలిసిందోచ్.. కీలక ఫీచర్లు, ధర వివరాలివే..!

Oppo Reno 14 : భారత్‌లో ఒప్పో రెనో 14 సిరీస్ లాంచ్ టైమ్ లైన్ లీక్ అయింది. కీలక ఫీచర్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి.

Oppo Reno 14 : ఒప్పో రెనో 14 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌ ఎప్పుడో తెలిసిందోచ్.. కీలక ఫీచర్లు, ధర వివరాలివే..!

Oppo Reno 14

Updated On : May 27, 2025 / 8:02 PM IST

Oppo Reno 14 : ఒప్పో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అతి త్వరలో ఒప్పో రెనో 14 సిరీస్ వచ్చేస్తోంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఈ ఒప్పో రెనో 14 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Read Also : Android Camera Phones : ఐఫోన్ ఎందుకు భయ్యా.. ఈ 6 ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు ఉండగా.. ఫొటో క్వాలిటీ కేక..!

ప్రస్తుతానికి గ్లోబల్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. కొత్త లీక్ ప్రకారం.. భారత్‌లో ఒప్పో రెనో 14 సిరీస్ లాంచ్ టైమ్‌లైన్‌ రివీల్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ చైనీస్ మోడల్ మాదిరిగానే అద్భుతమైన ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది.

ఒప్పో రెనో 14 లాంచ్ టైమ్‌లైన్ :
భారత్‌లో ఒప్పో రెనో 14 సిరీస్ మొత్తం రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఒప్పో రెనో 14, రెనో 14 ప్రో ఫోన్లు ఇటీవలే చైనాలో లాంచ్ అయింది.

భారత మార్కెట్లో ఒప్పో రెనో 14 సిరీస్ అతి త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ జూలై మొదటి వారంలో వస్తుందని అంచనా. కంపెనీ లాంచ్ కచ్చితమైన తేదీని ఇంకా రివీల్ చేయలేదు.

ఒప్పో రెనో 14 స్పెసిఫికేషన్లు (అంచనా) :
రాబోయే ఒప్పో రెనో 14 సిరీస్‌ ఫోన్ ఒప్పో నోట్స్, క్యాలెండర్, క్లాక్ వంటి యాప్‌లకు జెమిని ఇంటిగ్రేషన్‌ ఉండొచ్చు. భారత్‌లో ఒప్పో రెనో 14 చైనీస్ వేరియంట్ మాదిరిగానే ఫీచర్లను కలిగి ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి.

ఈ ఒప్పో ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్, 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీతో రానుంది.

ఒప్పో రెనో 14 ఫోన్ IP66, IP68, IP69 రేటింగ్‌తో రానుంది. 50MP మెయిన్ కెమెరా, 3.5x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది.

ఫ్రంట్ సైడ్ ముందు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండొచ్చు. రెనో 14 ప్రోలో 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో పాటు 50MP ప్రైమరీ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి. డైమెన్సిటీ 8450 చిప్‌సెట్‌‌తో రావచ్చు.

Read Also : IBM Layoffs 2025 : IBMలో భారీగా ఉద్యోగాల కోత.. AI దెబ్బకు 8వేల జాబ్స్ ఫట్.. ఎక్కువ HR విభాగంలోనే..!

భారత్‌లో ఒప్పో రెనో 14 సిరీస్ ధర (అంచనా) :
ఒప్పో రెనో 14 సిరీస్ ప్రారంభ ధర సుమారు రూ. 40వేలు రూపాయలు ఉంటుందని అంచనా. ఒప్పో రెనో 13 సిరీస్ రూ. 37,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది.