IBM Layoffs 2025 : IBMలో భారీగా ఉద్యోగాల కోత.. AI దెబ్బకు 8వేల జాబ్స్ ఫట్.. ఎక్కువ HR విభాగంలోనే..!
IBM Layoffs 2025 : టెక్ దిగ్గజం ఐబీఎం 8వేల మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్యలో భారీగా కోతలను విధిస్తోంది.

IBM Layoffs 2025
IBM Layoffs 2025 : ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాల కోత మొదలైంది. ఒక్కో టెక్ కంపెనీ భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
మైక్రోసాఫ్ట్ ఇటీవలే దాదాపు 6,700 మంది ఉద్యోగులను తొలగించగా, తాజాగా ఐబీఎం కంపెనీ ఏకంగా 8వేల ఉద్యోగులను తొలగించింది. హ్యూమన్ రీసోర్సెస్ (HR) విభాగంలోనే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు తెలుస్తోంది.
Read Also : Google Pixel 8a : గూగుల్ పిక్సెల్ ఫోన్ 8aపై ఖతర్నాక్ డిస్కౌంట్.. అతి తక్కువ ధరకే ఇలా కొనేసుకోండి..!
ఐబీఎం గతంలోనే హ్యుమన్ రీసోర్సెస్‌కు సంబంధించి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఏఐతో ఖర్చులు తగ్గించుకోవడమే కాకుండా ఉద్యోగులను తగ్గించుకోవాలని ఐబీఎం ఈ దిశగా ఉద్యోగాల కోతలను చేపడుతున్నట్టు తెలుస్తోంది.
కంపెనీలో ప్రధానంగా హెచ్ఆర్ విభాగంలోని ఉద్యోగులను ఏఐతో రిప్లేస్ చేయాలని భావిస్తోంది. హెచ్ఆర్ విభాగంలో ఉద్యోగులు చేయాల్సిన పూర్తి పనులను ఏఐతో చేయించేందుకు సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ నేపథ్యంలోనే ఐబీఎం ఉద్యోగాల్లో భారీ కోత విధించాలని నిర్ణయం తీసుకుంది.
2024 కంపెనీలో 2.8 లక్షల మంది ఐబీఎంలో ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు లేఆఫ్స్ తో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గనుంది.
ఏఐ, ఆటోమేషన్ వినియోగంతో ఐబీఎంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య పెరిగిందని ఇప్పుడు కంపెనీ సేవ్ చేసిన మొత్తాన్ని సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్, అమ్మకాలు వంటి ఇతర రంగాలలో తిరిగి పెట్టుబడి పెట్టే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.
ఐబీఎం చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్, నికిల్ లామోరాక్స్ మాట్లాడుతూ.. ఏఐ వాడకంతో అన్ని ఉద్యోగాలు పోతాయని కాదన్నారు. ఏఐ అవసరం ఉన్నచోట ఆయా రోల్స్ పూర్తిగా రీప్లేస్ అవుతాయని పేర్కొన్నారు. కంపెనీలో భారీగా కోతలు ఉన్నా ఐబీఎం ఏఐ టూల్స్ క్లయింట్‌లకు ప్రమోట్ చేస్తూనే ఉంది.
Read Also : Android Camera Phones : ఐఫోన్ ఎందుకు భయ్యా.. ఈ 6 ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు ఉండగా.. ఫొటో క్వాలిటీ కేక..!
ఈ నెలలో జరిగిన వార్షిక థింక్ సమావేశంలో వ్యాపారాలు, సొంత ఏఐ ఏజెంట్ల నిర్వాహణ కోసం కొత్త సర్వీసులను కూడా ప్రారంభించింది. ఈ టూల్స్ ఓపెన్ఏఐ, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రధాన ప్లాట్‌ఫామ్‌లతో కలిసి పనిచేయనుంది.