Google Pixel 8a : గూగుల్ పిక్సెల్ ఫోన్ 8aపై ఖతర్నాక్ డిస్కౌంట్.. అతి తక్కువ ధరకే ఇలా కొనేసుకోండి..!
Google Pixel 8a : ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Google Pixel 8a
Google Pixel 8a : గూగుల్ పిక్సెల్ యూజర్లకు అదిరే ఆఫర్.. కొత్త పిక్సెల్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ గూగుల్ పిక్సెల్ 8aపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ ద్వారా రూ. 18వేల వరకు సేవ్ చేసుకోవచ్చు.
గూగుల్ పిక్సెల్ 8a ఫ్లిప్‌కార్ట్ డీల్ :
భారత మార్కెట్లో పిక్సెల్ 8a ఫోన్ రూ.52,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పిక్సెల్ ఫోన్ రూ.37,999కి అందుబాటులో ఉంది. పిక్సెల్ 8aపై రూ.15వేలు ఫ్లాట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ద్వారా అదనంగా రూ.3వేలు డిస్కౌంట్ పొందవచ్చు. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు.
పిక్సెల్ 8a స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 8ఎ ఫోన్ 6.1-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను అందిస్తుంది. హుడ్ కింద, పిక్సెల్ 8a టెన్సర్ G3 చిప్‌సెట్, టైటాన్ M2 సెక్యూరిటీ చిప్ ద్వారా పవర్ పొందుతుంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ బ్యాక్ సైడ్ 64MP OIS ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రావైడ్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరా కూడా ఉంది.
Read Also : Realme GT 7 Series : రియల్‌మి GT 7 సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతో తెలుసా?
గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ 18W వైర్డ్ ఛార్జింగ్, Qi-సర్టిఫైడ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4,404mAh బ్యాటరీతో వస్తుంది. ఇతర ఫీచర్లలో లైవ్ ట్రాన్స్‌లేట్, బెస్ట్ టేక్, మ్యాజిక్ ఎడిటర్ ఉన్నాయి. ఫోన్ కాల్స్ చేసేటప్పుడు సౌండ్ రియాక్షన్, విజువల్ ఎఫెక్ట్ కోసం ఆడియో ఎమోజీలు కూడా ఉన్నాయి.