Airtel OTT Plan : ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. అతి చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్.. నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్‌తో 25 OTT బెనిఫిట్స్..!
Airtel OTT Plan : ఎయిర్‌టెల్ ఎంట్రీ లెవల్ OTT ప్యాక్ నెల వ్యాలిడిటీతో రూ.279కి పొందవచ్చు. సపరేటుగా తీసుకుంటే రూ.750 చెల్లించాల్సి వస్తుంది.

Airtel Prepaid Plans
Airtel OTT Plan : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. టెలికాం దిగ్గజం ప్రీపెయిడ్ యూజర్ల కోసం (Airtel OTT Plan) ఆల్-ఇన్-వన్ OTT ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ ప్రవేశపెట్టింది.
నెలకు కేవలం రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, ZEE5, సోనీలైవ్ సహా 25కి పైగా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్ పొందవచ్చు.
కంపెనీ ప్రకారం.. ఎయిర్‌టెల్ యూజర్లు అంతర్జాతీయ, బాలీవుడ్ ఇతర రీజియన్ టీవీ ప్రొగ్రామ్స్, సినిమాలు ఇలా అన్నీ ఒకే చోట 16కి పైగా భాషలలో వీక్షించవచ్చు.
ఎంట్రీ లెవల్ OTT ప్యాక్ నెల వ్యాలిడిటీతో రూ.279కి పొందవచ్చు. Netflix Basic, JioHotstar, Zee5, Airtel Xstream Play Premium యాక్సస్ పొందవచ్చు. ఈ ప్లాన్ విడిగా తీసుకుంటే రూ.750 చెల్లించాల్సి వస్తుంది.
ఎయిర్‌టెల్ OTT ప్లాన్లు ఇవే :
అలాగే, అన్‌లిమిటెడ్ 5G డేటా, ఫోన్ కాల్స్, ఎయిర్‌టెల్ OTT బెనిఫిట్స్‌తో రెండు ఆల్-ఇన్-వన్ ప్రీపెయిడ్ ప్లాన్లను పొందవచ్చు. రూ. 598తో 28 రోజుల వ్యాలిడిటీ, రూ. 1729 తో 84 రోజుల వ్యాలిడిటీ అందిస్తాయి. ఈ ప్లాన్‌లు అన్‌లిమిటెడ్ 5G డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, OTT బెనిఫిట్స్ పొందవచ్చు.
ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ 5G డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు OTT యాక్సెస్‌తో కూడిన ఫుల్ బండిల్ కూడా పొందవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీతో బండిల్ రూ. 598కు పొందవచ్చు. అయితే, 84 రోజుల ఫుల్ బండిల్ రూ. 1729కు వస్తుంది.
Read Also : Vivo T4 Ultra : వివో ఫోనా మజాకా.. వివో T4 అల్ట్రా వచ్చేస్తోందోచ్.. కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే యాప్ ద్వారా నేరుగా ప్యాక్ యాక్టివేట్ చేయొచ్చు. LionsgatePlay, AHA, SunNxt, Hoichoi, Eros Now, ShemarooMe వంటి స్ట్రీమింగ్ కంటెంట్ కూడా ఈజీగా యాక్సస్ చేయొచ్చు.