Realme GT 7 Series : రియల్‌మి GT 7 సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతో తెలుసా?
Realme GT 7 Series : రియల్‌మి GT 7 సిరీస్ వచ్చేసింది.. ఒకటి కాదు.. ఏకంగా మూడు ఫోన్లు లాంచ్ అయ్యాయి. ధర, ఫీచర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి..

Realme GT 7 Series
Realme GT 7 Series : కొత్త రియల్‌మి ఫోన్ కొంటున్నారా? భారత్ సహా ప్రపంచ మార్కెట్లలో రియల్‌మి GT 7 సిరీస్‌ను ప్రవేశపెట్టింది.
రియల్‌మి GT 7, రియల్‌మి GT 7T లైనప్‌తో లాంచ్ చేసింది. రియల్‌మి GT 6, రియల్‌మి GT 6T ఫోన్లకు అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ ఫోన్లలో అద్భుతమైన కెమెరా, బ్యాటరీ అప్‌గ్రేడ్స్ అందిస్తోంది.
ఈ రెండు రియల్‌మి ఫోన్లు 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7,000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. BGMI గేమ్‌ప్లే సమయంలో స్టేబుల్ 120FPS అందిస్తాయని కంపెనీ పేర్కొంది. రియల్‌మి GT 7, రియల్‌మి GT 7T ధర, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రియల్‌మి GT 7 స్పెసిఫికేషన్లు :
రియల్‌మి GT 7 ఫోన్ 6.78 అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది.
ఈ రియల్‌మి ఫోన్ HDR10+కి కూడా సపోర్టు ఇస్తుంది. గొరిల్లా గ్లాస్ GG7i ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ రియల్‌మి ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400e ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది.
16GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ రియల్‌మి ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ రియల్‌మి దాదాపు 40 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS స్కిన్‌పై రన్ అవుతుంది.
కెమెరా విషయానికొస్తే.. ఈ రియల్‌మి 50MP ప్రైమరీ కెమెరా (సోనీ IMX906), 8MP అల్ట్రావైడ్ సెన్సార్, 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ రియల్‌మి ఫోన్ 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది.
Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, డ్యూయల్ నానో-సిమ్ / ఇ-సిమ్ (ఈయూ / రష్యా) సపోర్టును అందిస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP66/IP68/IP69 రేటింగ్‌ను కూడా అందిస్తుంది.
రియల్‌మి GT 7 డ్రీమ్ ఎడిషన్ :
రియల్‌మి GT 7 డ్రీమ్ ఎడిషన్ ఫోన్ ఏరోడైనమిక్ లైన్‌లతో వస్తుంది. ఆస్టన్ మార్టిన్ రేసింగ్ గ్రీన్ ఫినిషింగ్, ట్రిపుల్-లేయర్ సిల్వర్ వింగ్ ఐకాన్ కలిగి ఉంది.
ఈ ఫోన్ కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఎలిమెంట్స్, ఆస్టన్ మార్టిన్ F1 టీమ్ కెమెరా వాటర్‌మార్క్‌ను కలిగి ఉంది. ఇందులో కో-బ్రాండెడ్ గిఫ్ట్ బాక్స్, స్పెషల్ అప్లియన్సెస్ ఉన్నాయి. ఈ ఫోన్ సింగిల్ 16GB, 512GB వేరియంట్‌లలో లభిస్తుంది.
రియల్‌మి GT 7T స్పెసిఫికేషన్లు :
రియల్‌మి GT 7T ఫోన్ 6.8-అంగుళాల ఫుల్ HD అమోల్డ్ ప్యానెల్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 8400-MAX ప్రాసెసర్‌తో వస్తుంది. 12GB వరకు LPDDR5X ర్యామ్, 512GB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్, 7,000mAh బ్యాటరీ సపోర్టుతో వస్తుంది.
ఈ రియల్‌మి 50MP ప్రైమరీ షూటర్, 8MP సెకండరీ కెమెరాతో సహా డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా అందిస్తుంది. పోర్ట్రెయిట్, నైట్, పనోరమా, డ్యూయల్-వ్యూ వీడియో వంటి వివిధ షూటింగ్ మోడ్ అందిస్తుంది.
Wi-Fi 6, బ్లూటూత్ 6.0 (SBC, AAC, aptX, aptX-HD, LDAC కోడెక్‌లతో), పేమెంట్లు యాక్సెస్ కార్డ్ కోసం NFC, IR బ్లాస్టర్‌ను కలిగి ఉంది. డ్యూయల్-బ్యాండ్ GPS, BeiDou, GLONASS, గెలీలియో, QZSS, NavIC సపోర్టుతో నావిగేషన్ అందిస్తుంది.
భారత మార్కెట్లో రియల్‌మి GT 7 సిరీస్, డ్రీమ్ ఎడిషన్ ధర :
రియల్‌మి GT 7, రియల్‌మి GT 7T, రియల్‌మి GT 7 డ్రీమ్ ఎడిషన్ వేరియంట్ వారీగా ధరలు ఇలా ఉన్నాయి.
రియల్‌మి GT 7 ధర :
8GB + 256GB : రూ. 39,999
12GB + 256GB : రూ. 42,999
12GB + 512GB : రూ. 46,999
కలర్ ఆప్షన్లు : ఐస్సెన్స్ బ్లాక్, ఐస్సెన్స్ బ్లూ
రియల్‌మి GT 7T ధర :
8GB + 256GB : రూ. 34,999
12GB + 256GB : రూ. 37,999
12GB + 512GB : రూ. 41,999
కలర్ ఆప్షన్లు : ఐస్సెన్స్ బ్లాక్, ఐస్సెన్స్ బ్లూ, రేసింగ్ ఎల్లో
రియల్‌మి GT 7 డ్రీమ్ ఎడిషన్ ధర :
16GB + 512GB : రూ. 49,999
కలర్ ఆప్షన్లు : ఆస్టన్ మార్టిన్ రేసింగ్ గ్రీన్