Android Camera Phones : ఐఫోన్ ఎందుకు భయ్యా.. ఈ 6 ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు ఉండగా.. ఫొటో క్వాలిటీ కేక..!
Android Camera Phones : ఐఫోన్ 16 కొంటున్నారా? ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా అంతే పవర్‌ఫుల్ కెమెరా బెస్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Android Camera Phones
Android Camera Phones : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఐఫోన్ 16 కన్నా అద్భుతమైన కెమెరా (Android Camera Phones) ఫీచర్లతో ఆండ్రాయిడ్ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కెమెరా ఫీచర్ల కోసమైతే ఒక్క ఐఫోన్ మాత్రమే కాదు.. ఆండ్రాయిడ్ ఫోన్లలో అంతే క్వాలిటీతో కెమెరా ఫీచర్లు ఉన్నాయి.
Read Also : Realme GT 7 Series : రియల్‌మి GT 7 సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతో తెలుసా?
ఐఫోన్ 16 పవర్‌ఫుల్ కెమెరా ఫోన్ ఉన్నప్పటికీ.. టాప్ రేంజ్ పర్ఫార్మెన్స్, ఫొటో క్వాలిటీని అందిస్తుంది. 2025లో ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు అంతే స్థాయిలో కెమెరా ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఐఫోన్ 16 కన్నా బెటర్ కెమెరా ఫీచర్లు కలిగిన 6 అద్భుతమైన ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం..
గూగుల్ పిక్సెల్ 9 :
గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ OISతో 50MP మెయిన్ సెన్సార్, 48MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. పిక్సెల్ షిఫ్ట్, అల్ట్రా-HDR, 4K వీడియో వంటి ఫీచర్లతో వస్తుంది. ఐఫోన్ 16 కెమెరా ఫీచర్ల కన్నా బెటర్ ఫీచర్లతో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పిక్సెల్ ఫోన్ రూ.79,999కి అందుబాటులో ఉంది.
వివో X200 :
వివో X200 ఫోన్ OISతో మెయిన్ లెన్స్, 3x జూమ్‌తో టెలిఫోటో, అల్ట్రావైడ్ షూటర్‌తో మల్టీఫేస్ ట్రిపుల్ 50MP కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. Zeiss ఆప్టిక్స్, 32MP 4K ఫ్రంట్ కెమెరాతో ఐఫోన్ 16 కన్నా పవర్‌ఫుల్ కెమెరా ఫోన్ కలిగి ఉంది. ఈ వివో ఫోన్ రూ.65,999 ధరకు లభిస్తోంది.
ఒప్పో ఫైండ్ X8 :
ఒప్పో ఫైండ్ X8 ఫోన్ ట్రిపుల్ 50MP కెమెరా సిస్టమ్, వైడ్, 3x పెరిస్కోప్ జూమ్, హాసెల్‌బ్లాడ్ ట్యూన్ అల్ట్రావైడ్ లెన్స్‌లు ఉన్నాయి. 4K వీడియో, డాల్బీ విజన్, క్రిస్ప్ 32MP 4K ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఐఫోన్ 16 కన్నా కెమెరా-ఫోకస్డ్‌తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఒప్పో ఫోన్ రూ.68,999 ధరకు అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ S25+ :
శాంసంగ్ గెలాక్సీ S25+ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్, సూపర్ స్టెడీ వీడియోతో 12MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. 8K రికార్డింగ్, HDR10+ సపోర్టుతో ఐఫోన్ 16 కన్నా ఆకర్షణీయమైన కెమెరా ఫోన్ కలిగి ఉంది. ఈ గెలాక్సీ S25 ప్లస్ ధర రూ.99,999 నుంచి అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ 13 :
వన్‌ప్లస్ 13 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్, హాసెల్‌బ్లాడ్ 50MP ట్రిపుల్ కెమెరా కలిగి ఉంది. ప్రీమియం 6.82-అంగుళాల LTPO అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 8K వీడియో రికార్డింగ్, 6000mAh బ్యాటరీ ఐఫోన్ 16 కన్నా అద్భతంగా ఉంటుంది. ఈ వన్‌ప్లస్ 13 ఫోన్ రూ.69,998 ధరకు కొనుగోలు చేయొచ్చు.
Read Also : Google Pixel 8a : గూగుల్ పిక్సెల్ ఫోన్ 8aపై ఖతర్నాక్ డిస్కౌంట్.. అతి తక్కువ ధరకే ఇలా కొనేసుకోండి..!
షావోమీ 15 :
అమెజాన్‌లో షావోమీ 15 ఫోన్ 50MP OIS-ఎనేబుల్డ్ మెయిన్ సెన్సార్, 50MP 2.6x జూమ్ టెలిఫొటో, 50MP అల్ట్రావైడ్ లెన్స్‌తో సహా లైకా-ఆప్టిమైజ్ ట్రిపుల్-కెమెరా సెటప్ కలిగి ఉంది. 8K HDR, డాల్బీ విజన్ సపోర్టుతో అద్భుతమైన కెమెరా కలిగి ఉంది. ఈ షావోమీ 15 ఫోన్ రూ.64,999 ధరకు లభ్యమవుతుంది.